వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రై వ్యాలీ తెలుగు విద్యార్థులకు ఊరట, ప్రత్యామ్నాయాలకు ఓకే

By Pratap
|
Google Oneindia TeluguNews

Tri-Valley University
వాషింగ్టన్: అమెరికాలో చదువు కొనసాగించడానికి అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాల కోసం తమను సంప్రదించాలని ఆ దేశ ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ట్రైవ్యాలీకి చెందిన భారత విద్యార్థులకు సూచించారు. http://www.ice.gov/sevis/tri-valley-110118.htm వెబ్‌సైట్లో సంబంధిత సమాచారాన్ని అందుబాటులో ఉంచినట్లు ఇమ్మిగ్రేషన్‌, కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ (ఐసీఈ) తెలియజేసింది. ఈ వెబ్‌సైట్లో స్టూడెంట్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ విజిటర్‌ ప్రోగ్రామ్‌ (ఎస్‌ఈవీపీ) లింక్‌ను ఉంచారు. ఎస్‌ఈవీపీ అధికారులను సంప్రదిస్తే అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను వివరిస్తారని ఐసీఈ సూచించింది. ట్రైవ్యాలీ విశ్వవిద్యాలయంలో చేరిన 95 శాతం మంది భారత విద్యార్థుల్లో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులే.

భవిష్యత్తులో అమెరికాలో చదువుకోవాలన్నా నిషేధం లేని విధంగా ప్రస్తుతానికి దేశం విడిచివెళ్లే అవకాశాల గురించి కూడా వివరిస్తారని తెలిపింది. ట్రైవ్యాలీ వర్సిటీ పలు దేశాల విద్యార్థులకు అక్రమంగా వీసాలు ఇప్పించినట్లు ఐసీఈ దర్యాప్తులో వెల్లడయింది. విద్యార్థులందరూ కాలిఫోర్నియాలో ఉన్నట్లు అధికార పత్రాల్లో చూపించినప్పటికీ వారిలో చాలా మంది దేశంలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లు కూడా విచారణలో వెల్లడయింది. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థుల కాళ్లకు పోలీసులు రేడియో కాలర్లు అమర్చడంతో పాటు, ఇంకా పలువురుని నిర్బంధంలోకి తీసుకున్నారు. వర్సిటీ పాల్పడిన అక్రమాలకు విద్యార్థులను దోషులుగా చేయడం అమానవీయమని భారత్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో వారికి న్యాయం చేస్తామని అక్కడి అధికారులు హామీ ఇచ్చారు.

English summary
USA Immigration authorities suggested students of Tri - Valley university should approach them for alternative arrangement to continue education. Students cam also approach immigration authorities to leave USA.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X