హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డ్రగ్స్‌తో నటి జీవిత సోదరుడు, తెలుగు సినీ నిర్మాత మురళి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajasekhar and jeevitha
హైదరాబాద్: తెలుగు సినిమా నిర్మాత మురళి డ్రగ్స్‌తో పోలీసులకు పట్టుబడ్డారు. మురళిని పోలీసులు హైదరాబాదులోని జూబ్లీ హిల్స్ ప్రాంతంలో రెడ్ హ్యాండెడ్‌గా మురళిని అరెస్టు చేశారు. మగాడు, శేషు చిత్రాలకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. మురళి ప్రముఖ సినీ నటి జీవిత సోదరుడని తెలుస్తోంది. హీరో రాజశేఖర్ బావమరిది అని కూడా సమాచారం. జీవిత, రాజశేఖర్ దంపతులు రాజకీయాల్లో కూడా తమ పాత్ర పోషిస్తున్నారు. వారు మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌కు మద్దతిస్తున్నారు.

ఇంతకు ముందు సినీ హీరో రవితేజ సోదరులు భరత్, రఘు డ్రగ్స్‌తో పట్టుబడిన విషయం తెలిసిందే. నిర్మాత వెంకటేశ్వర రావు డ్రగ్స్‌తో పట్టుబడినప్పటి నుంచి డ్రగ్స్ మాఫియాతో టాలీవుడ్ సంబంధాలు బయటపడుతున్నాయి. మురళిని రక్షించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ డ్రగ్స్ మాఫియా వెనక మరింత మంది ఉండవచ్చునని తెలుస్తోంది.

English summary
Telugu filn producer and Jeevitha's brother Murali caught red handedly wit drugs. Hyderabad Jubilee hills police arrested Murali friday evening. Murali produced films Magaadu anad Sheshu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X