వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎడిసన్ 164వ జన్మదినాన్ని గుర్తు చేసిన గూగుల్ డూడుల్

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

homas Alva Edison
కాలిఫోర్నియా: మానవ జాతిని ప్రభావితం చేసిన విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్ వంటి అనేక ఉపకరణాలను ప్రాణం పోసిన గొప్ప అమెరికన్ శాస్త్రవేత్త థామస్ అల్వా ఎడిసన్ 164వ జన్మదినాన్ని అంతర్జాల దిగ్గజం "గూగుల్" డూడుల్‌ (సంధర్భానికి తగిన బోమ్మలతో కూడిన గూగుల్ లోగో)ను తమ హోమ్‌పేజ్‌లో ప్రదర్శనకు ఉంచి మరోసారి అల్వా ఎడిసన్ ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేసింది. గత రెండు రోజుల క్రితం కూడా గూగుల్ డూడుల్ ఫ్రెంచ్‌కు చెందిన సైన్స్ ఫిక్షన్ నవలల రచయిత "జూల్స్ వెర్న్" 183వ జన్మదినాన్ని కూడా గుర్తు చేసిన సంగతి తెలిసిందే.

థామస్ అల్వా ఎడిసన్ వంటి పలు ప్రముఖులను ప్రతి ఏటా గూగుల్ డూడుల్‌పై ప్రదర్శించి ప్రపంచవ్యాప్తంగా వారు సాధించిన ఘతనతలు గుర్తు చేస్తుంది. ఇందులో భాగంగానే... శుక్రవారం, ఫిబ్రవరి 11న థామస్ అల్వా ఎడిసన్ 164వ జన్మదినాన్ని కూడా గూగుల్ గుర్తుచేయడం జరిగింది. ఈ గూగుల్ డూడుల్‌పై ఎడిసన్ కనుగొన్న ఎలక్ట్రిక్ బల్బు, ఫోనోగ్రాఫ్, కినెటోస్కోప్‌లను ప్రదర్శించారు. ఈ డూడుల్‌ను క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఇందులో దాగున్న GOOGLE అనే ఆంగ్ల అక్షరాలు పరికరాల రూపంలో కనిపిస్తాయి. ఇదే గూగుల్ డూడుల్ ప్రత్యేకత.

థామస్ అల్వా ఎడిసన్ అమెరికాలోని ఓహియో రాష్ట్రానికి చెందిన మిలన్ అనే ప్రాంతంలో 1847లో జన్మించారు. ఈయన తండ్రి శామ్యూల్ ఆగ్డెన్ ఎడిసన్ జూనియర్, తల్లి నాన్సీ మాథ్యూస్ ఎడిసన్. ఎడిసన్ చిన్నతనంలో ఓ వార పత్రిక (వీక్లీ పేపర్)కు "పేపర్ బాయ్"గా పనిచేశారు. తర్వాతి కాలంలో టెలిగ్రాఫ్ ఆపరేటర్‌గా పనిచేశారు. 1877లో ఎడిసన్ ఫోనోగ్రాఫ్‌ను కనుగొన్నారు. దీంతో ఆయనకు "మెన్లో పార్క్ మాంత్రికుడు" అనే పేరు వచ్చింది. ఎడిసన్ కనుగొన్న పరికరాలలో ప్రొజెక్టర్, మోషన్ పిక్చర్ కెమరా వంటి దాదాపు 1093 పరికరాలు ఉన్నాయి. 1931లో ఎడిసన్ 84 ఏట అమెరికాలోని వెస్ట్ ఆరెంజ్‌లో కన్నుమూశారు.

థామస్ అల్వా ఎడిసన్ భౌతికంగా మరణించినప్పటికీ వెలుగుతున్న బల్బు ఎల్లప్పుడూ ఆయనను గుర్తు చేస్తూనే ఉంటుంది.

English summary
Just two days after featuring a special interactive doodle for French science fiction novelist Jules Verne, the internet giant Google has depicted another doodle on its search engine homepage to pay tribute to the great inventor who filled light in our lives, Thomas Alva Edison.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X