హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు అయినంత మాత్రాన ఆయనను సమర్థించాలా అని ఎమ్మెల్సీ కందుల దుర్గేష్ ఓ లేఖలో జగన్‌ను శుక్రవారం ప్రశ్నించారు. వైయస్ తనయుడనే సమర్థించాలనే వాదనను ఖండించారు. అలా అయితే నాకు రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ టిక్కెట్టు ఇప్పించారని అయితే నేను ఆయనకే విధేయుడిగా ఉండాలా అని ప్రశ్నించారు. జగన్‌తో వెళ్లిన వారే వైయస్ అభిమానులు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారే వైయస్ నిజమైన అభిమానులన్నారు.
వైయస్ కాంగ్రెస్ పార్టీ నేతగా, ముఖ్యమంత్రిగానే మరణించారన్నారు. వైయస్ కాంగ్రెస్ సొత్తు అని తేల్చి చెప్పారు. వైయస్ తాను చనిపోయే వరకు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న కోరికను వెలిబుచ్చారని చెప్పారు. వ్యక్తికన్నా వ్యవస్థ గొప్పదన్నారు. వ్యక్తులు వెళ్లినా వ్యవస్థ ఉంటుందని చెప్పారు.
MLC Kandula Durgesh questioned Ex MP YS Jaganmohan Reddy in his letter. Those who are going with YS Jagan, they were not YSR's men, said Durgesh. YSR was Congress property.
Story first published: Friday, February 11, 2011, 15:57 [IST]