హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చిరంజీవి కాంగ్రెసులో ఓ రెట్ట, అల్లు అరవింద్ కంపెనీలా మార్చాడు: జోగయ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Harirama Jogaiah
హైదరాబాద్: మహాసముద్రంలాంటి కాంగ్రెస్ పార్టీలో ఇకపై చిరంజీవి ఒక రెట్టలాంటి వారని మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత హరిరామజోగయ్య ఎద్దేవా చేశారు. రేపటినుంచి చిరంజీవికూడా హైకమాండ్ ముందు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. తన హీనస్థితిని చూసుకుని 'కాంగ్రెస్‌లో ఎందుకు చేరానా..?" అని బాధపడాల్సిన రోజులు త్వరలోనే వస్తాయని జోస్యం చెప్పారు. తనను చిరంజీవి విమర్శించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ శుక్రవారం ఆయనకు ఒక బహిరంగ లేఖ రాశారు.

పార్టీని అల్లు అరవింద్ ఫ్యామిలీ లిమిటెడ్ కంపెనీగా నడిపారే తప్ప ఏనాడైనా తనలాంటి సీనియర్ల సలహాలు తీసుకున్నారా? అని లేఖలో ప్రశ్నించారు. సామాజిక న్యాయం కోసం పాటుపడతారని భావించి సంవత్సరంముందే ఎంపీ పదవిని వదులుకొని పీఆర్పీలోకి వచ్చిన తనపై ఆరోపణలు చేయటంతోనే చిరంజీవి సంస్కారమేమిటో అర్థమవుతోందని విమర్శించారు. తన భార్య చనిపోయిన దు:ఖంలో ఉండి కూడా 20 రోజులు పాలకొల్లులో ఉండి ఊరూరా తిరిగి ప్రచారం చేసినా చిరంజీవి ఐదువేల ఓట్లతో ఓడిపోయారని చెప్పారు.

తానే కనుక పనిచేయకపోతే 20 వేల ఓట్ల తేడాతో ఓడిపోయేవారని చెప్పారు. తిరుపతి మీటింగు నాటికి పార్టీకి ఉన్న రేటింగు, ఎన్నికలనాటికి పడిపోయి కేవలం 18 సీట్లకు పడిపోవటానికి కారణం చిరంజీవి చేతకానితనం కాదా అని ప్రశ్నించారు. మీరేదో ఉద్దరిస్తారనుకుని నమ్ముకుని వచ్చిన వారిని నట్టేటముంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి చేతులు దులుపుకున్నారని దుయ్యబట్టారు. సరైన వేదిక దొరికితే మరిన్ని విషయాలు బయటపెడతానని జోగయ్య తెలిపారు. పాలకొల్లు నుంచి తాను పోటీ చేసి ఉంటే గెలిచి ఉండేవాడినని ఆయన అన్నారు.

English summary
Ex MP Harirama Jogaiah lashed out at Chiranjeevi's decision to merge Prajarajyam party in Congress. Chiranjeevi's was blow to himself, as he would loose importance in Congress, he said. He also accused that Allu Aravind made PRP as a family limited company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X