హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ రాకపోవడానికి కారణం మేమే: సిడబ్లుసి సభ్యుడు కె కేశవరావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshava Rao
హైదరాబాద్: తెలంగాణ రాకపోవడానికి కారణం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేతలే అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ మెంబర్ కె కేశవరావు శనివారం తెలంగాణ సమన్వయ కమిటీ సమావేశంలో అన్నారు. తామే కారణమంటూ ఆయన పేర్కొనడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ మదీనా ఎడ్యుకేషన్ సెంటర్‌లో తెలంగాణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సంఘీభావ సదస్సు జరిగింది. తెలంగాణకు చెందిన పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. తెలంగాణ అంశంపై రాష్ట్ర ఎంపీలంతా కలిసి తనవద్దకు రావాలని ప్రధానమంత్రి కోరినప్పటికీ తెలంగాణ ఎంపీలు విడిగా వెళ్లారని చెప్పారు. సీడబ్ల్యుసీలో, సీఎల్పీలో తెలంగాణపై తీర్మానం చేయించింది తానేనన్నారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వ్యతిరేకిస్తున్నా తాను వెనక్కు తగ్గలేదన్నారు. తెలంగాణ కోసం పార్టీలు, జెండాలు పక్కనపెట్టి తెలంగాణ కోసం ఉద్యమించాలని వచ్చిన వారిని ఉద్దేశించి చెప్పారు. సహాయ నిరాకరణ ఉద్యమంలోనూ పాల్గొందామని పిలుపునిచ్చారు. దీని కోసం అందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశం కావాలని కోరారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక చెత్తఅన్నారు. తెలంగాణ విషయంలో సీమాంధ్ర ఎంపీల్లోనూ మార్పు వచ్చిందన్నారు.

English summary
CWC member, Congress senior leaders K Keshavarao blamed telangana congress leaders on Telangna seperate issue on Saturday. A meeting of political parties here on Saturday in support of separate Telangana saw the Congress and Telugu Desam leaders pointing fingers at each other about inability to convince their respective leadership to agree to Statehood. It was organised by the Telangana coordination committee. KK told that the Congress leaders spoke in different tunes in the State and New Delhi. It was power play between leaders from different regions within the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X