గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సాక్షిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసిన చేనేత, జౌళీ శాఖమంత్రి శంకర్‌రావు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Shankar Rao
గుంటూరు: చేనేత, జౌళీ శాఖామంత్రి శంకర్‌రావు సాక్షి పత్రికపై ఆదివారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. సాక్షి ప్రతినిధి అడిగే ప్రశ్నలకు తాను సమాధానం చెప్పనన్నారు. గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో సాక్షి ప్రతినిధి వేసిన ఏఐసిసి అధ్యక్షురాలు తదితర అంశాలపై అడిగిన ప్రశ్నలకు ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నేను మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వెంకటస్వామి(కాకా) సోనియాపై చేసిన వ్యాఖ్యలపై సాక్షి ప్రతినిధి ప్రశ్నించారు.

కాగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వరుసగా మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించి తీరుతుందని విజయవాడలో అన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాలో ఆయన ఆదివారం పర్యటించారు. విజయవాడలో సమీక్షా సమావేశం నిర్వహించారు. చేనేత శాఖ అధికారులు, చేనేత సొసైటీ సభ్యులు ఈ సమీక్షకు హాజరయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక్కో జిల్లా నుంచి నలుగురు ప్రతినిధులు చొప్పు వస్తే ముఖ్యమంత్రితో సమీక్ష ఏర్పాటు చేయిస్తానని శంకర్రావు చేనేత సొసైటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.312 కోట్ల చేనేత రుణమాఫీలో తొలివిడత 109 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు, మార్చి 21 లోపు ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని మంత్రి తెలిపారు.

English summary
Minister Shankar Rao fired again on Sakshi on Sunday in Guntur District. Sakshi reporter questioned Shankar Rao on KK comments towards Sonia Gandhi in his press conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X