హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

భానుకిరణ్‌తో పీఆర్పీ నేత, మాజీ ఎంపీ సోదరుడికి లింక్స్?

By Pratap
|
Google Oneindia TeluguNews

C Ramachandraiah
హైదరాబాద్: మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌తో మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత సి.రామచంద్రయ్య కుటుంబసభ్యలకు సంబంధాలున్నట్లు వార్తలు వచ్చాయి. రామచంద్రయ్య సోదరుడు శశికుమార్ శశికుమార్ తన అక్రమాలకోసం భానును అశ్రయించినట్లుగా తెలుస్తోంది. తన కబ్జా దందాల కోసం భానును సాయం అడిగాడేమేనని పోలీసులు అనుమానిస్తున్నట్లు ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది.భాను అతని సహచరుల ఇళ్లలో ఇటీవల సోదాలు నిర్వహించిన పోలీసులు దాదాపు 60 స్థలాలకు చెందిన దస్తావేజులను, స్థిరాస్తులకు చెందిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో నారాయణగూడ పోలిస్‌స్టేషన్‌లో 2009లో నమోదైన కేసులకు సంబందించిన రెండు ఎఫ్ఐఆర్ కాపీలు, వాటికి సంబంధించిన దస్తావేజులు కూడా ఉన్నాయి.

ఈ దస్తావేజులు హెదర్‌గూడలోని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో ఉన్న సాజిద్ మెజెస్టిక్ అపార్ట్‌మెంట్‌లోని ఓ ఫ్లాట్‌కు సంబంధించినవిగా తెలుస్తోంది. ఈ ఫ్లాట్‌ను శశికుమార్ అద్దెకు తీసుకుని అద్దె ఇవ్వకుండా యజమానిని వేధిస్తున్నాడని, పైగా ఫ్లాట్ యజమాని చల్లా శ్రీనివాస్ రెడ్డితో తాను రాయించుకున్న అద్దె అగ్రిమెంట్‌ను ఫోర్జరీ చేసి యజమానే తనకు రూ. ఆరున్నర లక్షల అప్పు ఉన్నట్లు దొంగ సాక్ష్యాలు సృష్టించనట్లు మరో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫ్లాట్ యజమాని చల్లా శ్రీనివాస్ రెడ్డికి, శశికుమార్‌కు మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించి 2009 ఫిబ్రవరిలో రెండు ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. భాను సన్నిహితుల ఇళ్లలో దొరికిన రెండు ఎఫ్ఐఆర్‌లు ఈ కేసులకు సంబంధించినవే. రెండేళ్ళ కిందటి ఈ ఎఫ్ఐఆర్ కాపీలు, వివాదానికి సంబంధించిన దస్తావేజులు భానుకిరణ్ వద్దకు ఎందుకు వచ్చాయన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

ఈ వివాదంలో శశికుమార్ తన ఇంటి యజమానిపై కోర్టులో కేసు వేశారు. ఇదిలా ఉండగా 2010 డిసెంబర్ 27న అద్దె అడగడానికి వెళ్ళిన యజమాని శ్రీనివాస్‌రెడ్డి, అతని సోదరుడు రాజేశ్వర్‌రెడ్డిలపై శశికుమార్ కుటుంబ సభ్యులు దాడికి దిగారు. రాజేశ్వర్‌రెడ్డిని తీవ్రంగా గాయపరచారు. దీనిపై కూడా పోలీసులు కేసులు నమోదు చేసారు. రామచంద్రయ్య ఒత్తిడి మేరకు కేవలం బాధితుడు రాజేశ్వర్ రెడ్డిని మాత్రమే పోలీసులు అరెస్టు చేసినట్లు ఆరోపణ. కాగా.. శశికుమార్‌పై బొల్లారం పోలీస్‌స్టేషన్‌లోనూ స్థిరాస్తి ఆక్రమణ వివాదంలో కేసులున్నాయి. దీంతో వివాదస్పదుడైన శశికుమార్ సెటిల్‌మెంట్లకోసం భానును సంప్రదించి ఉండవచ్చనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

English summary
PRP senior leader, Ex MP C.Ramachandraiah's brother Shashikumar links with Bhanukiran was exposed by a Telugu news daily today. It is said that, Shashikumar had contacts Bhanu for his illeagual activites. The police were reocovered some documents from Bhanu's residence were showing these links,it is learnt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X