వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేశవరావుతో భేటీ: తెలంగాణపై కాంగ్రెసు ఎమ్మెల్యేలు ఫలితం సాధిస్తారా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress MLAs
న్యూఢిల్లీ: తెలంగాణపై తమ పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు ఢిల్లీ వచ్చిన కాంగ్రెసు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు ఫలితం సాధిస్తారా అనేది అనుమానంగానే ఉంది. తెలంగాణ రాజకీయ జెఎసి ఈ నెల 16వ తేదీ నుంచి సహాయ నిరాకరణ తలపెట్టిన నేపథ్యంలో తెలంగాణకు చెందిన 24 మంది శాసనసభ్యులు, ఆరుగురు ఎమ్మెల్సీలు సోమవారం ఢిల్లీకి చేరుకున్నారు. వారు సాయంత్రం కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు కె. కేశవరావుతో సమావేశమయ్యారు. తెలంగాణపై తాము అనుసరించాల్సిన వ్యూహంపై కేశవరావుతో వారు చర్చించారు.

తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని తాము పార్టీ అధిష్టానం నేతలను కలిసి కోరుతామని వారు చెప్పారు. తాము కాళ్లు పట్టుకునైనా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించాలని కోరుతామని వారు చెప్పారు. డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం చేసిన ప్రకటనకు కట్టుబడి తెలంగాణ ఇవ్వాలని కోరుతామని వారు చెప్పారు. తెలంగాణ ఇస్తామనో, ఇవ్వమనో ఏదో ఒకటి స్పష్టంగా చెప్పాలని శాసనసభ్యుడు ముత్యం రెడ్డి అన్నారు.

అయితే, తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తెలంగాణపై తమ అధిష్టానంపై ఏ మేరకు ఒత్తిడి పెడతారనేది చెప్పలేని స్థితి. వారు అధిష్టానానికి చెందిన ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర నేతలతో కూడా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా సమావేశం కావాలని వారు ప్రయత్నిస్తున్నారు.

English summary
Congress MLAs and MLCs from Telangana region today met MP Keshav Rao to chalk out strategy on Telangana 
 
 issue. They demanded party high command clear statement on Telangana.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X