వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ అవాంఛనీయం: మనీష్ తివారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Manish Tiwari
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), తెలంగాణ ఉద్యోగుల సంఘాలు తలపెట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం అవాంఛనీయమని అఖిల భారత కాంగ్రెసు కమిటీ (ఎఐసిసి) అధికార ప్రతినిధి మనీష్ తివారీ అన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్రం చర్యలు ప్రారంభించిందని, ఇలాంటి స్థితిలో సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టడం అసందర్భమని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తెలంగాణపై యుపిఎ ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని ఆయన చెప్పారు.

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన చెప్పారు. తెలంగాణపై ఒక నిర్ణయం తీసుకునే సమయంలో సహాయ నిరాకరణ వంటి కార్యక్రమాలు చేపట్టడం సరైంది కాదని ఆయన అన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో యుపిఎ ప్రభుత్వమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ఆయన చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకునేటప్పుడు దానికి అడ్డు తగలడం మంచిది కాదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న తర్వాత కార్యక్రమాలు చేపట్టవచ్చునని ఆయన అన్నారు.

మనీష్ తివారీ ప్రకటనను తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ హైదరాబాదులో వ్యతిరేకించారు. మాట వరుసకు మాత్రమే మనీష్ తివారీ మాట్లాడుతున్నారని, చర్యలు తీసుకుంటామని ఎన్ని సార్లు చెప్తారని ఆయన అన్నారు. సహాయ నిరాకరణ వల్ల ప్రభుత్వం భయపడుతుందని అనుకోవడం లేదని, అయితే స్పందించాల్సిన అనివార్యతలో మాత్రం పడిందని ఆయన అన్నారు. మనీష్ తివారీ ప్రకటనలో కొత్తేమీ లేదని, అటువంటప్పుడ ప్రకటనలు ఎన్నాళ్లు చేస్తారని ఆయన అన్నారు.

English summary
AICC spokes persom Manish Tiwari terms proposed Telangana staff civil disobedience is unwarranted. He said that 
 
 Govermnent started to take action on Srikrishna commettee repoort. He said that, in this juncture Telangana 
 
 employees diccisiion to go on civil disobedience is not relevant.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X