బైరెడ్డి రాజశేఖర రెడ్డి వైయస్ జగన్ శంకర్రావు హైకోర్టు కర్నూలు baireddy rajasekhar reddy ys jagan shankar rao high court kurnool
డబ్బులతో జగన్ సిఎం కావాలనుకుంటున్నాడు: టిడిపి నేత బైరెడ్డి

జగన్‌పై హైకోర్టులో దాఖలైన పిటీషన్‌పై ఇంప్లీడ్ కావాలి తెలుగుదేశం పార్టీ అధికారికంగా నిర్ణయించిందని చెప్పారు. మంత్రి శంకర్రావు ఇచ్చిన వాటిలో చాలా వరకు మిస్ అయ్యాయని, మా వద్ద ఇంకా చాలా ఉన్నాయని వాటిని కోర్టుకు సమర్పిస్తామని చెప్పారు. మరిన్ని సాక్ష్యాలతో మేం జగన్ కేసులో ఇంప్లీడ్ అవుతామన్నారు. కడప జిల్లాలో టిడిపి మంచి ఓటు బ్యాంకు ఉందని చెప్పారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభ ఉప పోరులో విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ కల్లు తాగిన కోతి అని, ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదన్నారు.