హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సూట్‌కేసులన్నీ జగనే పట్టుకెళ్లారు, మా దగ్గరెక్కుడున్నాయి: విహెచ్

By Pratap
|
Google Oneindia TeluguNews

V Hanumantha Rao
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్, రహేజా వంటి గతంలో జరిగిన అవినీతి కార్యకలాపాలపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పందిస్తారని ఆశిస్తున్నానని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. అలా స్పందిస్తే కాంగ్రెసు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అవినీతిపై సమయం వచ్చినప్పుడు దర్యాప్తు జరుగుతుందని ఆయన అన్నారు.

అవినీతికి రాజకీయ వ్యవస్థ కారణం అని మాజీ న్యాయమూర్తులు అనడం సబబు కాదని వీహెచ్ అభిప్రాయపడ్డారు. కడప మాజీ ఎంపీ జగన్, తనపై వచ్చిన ఆరోపణలను పక్కదారి పట్టించేందుకే ప్రత్యారోపణలు చేస్తున్నారంటూ వీహెచ్ మండిపడ్డారు. సూట్‌కేసులన్నీ ఆయనే పట్టుకెళ్లారని, ఇంకా తమ వద్ద ఎక్కడున్నాయని వీహెచ్ చమత్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎప్పుడేం మాట్లాడుతారో ఆయనకే తెలియదని విహెచ్ వ్యాఖ్యానించారు.

English summary
Congress Rajyasabha member V Hanumanth Rao reacts against YS Jagan properties. VH hoped that CM Kiran Kumar Reddy may react on corruption involved in emaar properties and Raheja.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X