హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జెపిపై తెరాస ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డ్రైవర్ మల్లేష్ దాడి చేశాడా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: శాసనసభ మీడియా పాయింట్ వద్ద లోకసత్తా అధ్యక్షుడు, శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్ డ్రైవర్ మల్లేష్ దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి క్లిప్పింగులను కూడా టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతున్న జయప్రకాష్ నారాయణను తెరాస శానససభ్యులు నెట్టేయడం ప్రారంభించారు. ఈ సమయంలో తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు. ఈ సమయంలో మల్లేష్ చేయి లేపి జయప్రకాష్ నారాయణపై దాడి చేశాడని తెలుస్తోంది.

కాగా, జయప్రకాష్ నారాయణపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలడుగు వెంకటరావు కూడా గాయపడ్డారు. అప్పటికే శస్త్రచికిత్స చేయించుకున్న పాలడుగు వెంకటరావు దాడితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఆస్పత్రిలో చేరారు. పాలడుగు తనపై దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి అస్వస్థతకు గురయ్యారని జయప్రకాష్ నారాయణ కూడా చెప్పారు. కాగా, ప్రజాస్వామ్యం పేరు చెప్పి, తమను తాము మేధావులుగా చెప్పుకుంటూ జయప్రకాష్ నారాయణ వంటి నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షను దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని తెరాస నాయకులు జగదీశ్వర్ రెడ్డి, శ్రవణ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో విమర్శించారు. శాసనసభ సంఘటనలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారన్నారు.

English summary
It is said that, TRS MLA Etela rajender's car driver Mallesh has attcked Loksatta MLA Jayaprakash Narayan. TV 
 
 channels are showing video clippings of attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X