హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దాడిపై నేను ఫిర్యాదు చేయలేదు, చేయను: జయప్రకాష్ నారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: తనపై జరిగిన దాడి మీద తాను ఎవరికీ ఫిర్యాదు చేయలేదని, చేయబోనని లోకసత్తా అధ్యక్షుడు,త శాసనసభ్యుడు జయప్రకాష్ నారాయణ చెప్పారు. సంఘటనను తనపై వ్యక్తిగతంగా జరిగిన దాడి తాను పరిగణించడం లేదని, ఓ శాసనసభ్యుడి మీదనో ఓ పార్టీ నేత మీదనో జరిగిన దాడిగా తాను చూడడం లేదని, పతనమవుతున్న ప్రజాస్వామ్యానికి ఇది ప్రబల తార్కారణమని ఆయన గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. వాస్తవాలు కొందరి నోటి మీదుగా వస్తే వారికి విశ్వసనీయత ఉంది కాబట్టి, వారి మాటలు నమ్ముతారు కాబట్టి అలాంటి వారి గళం వినిపించకూడదని ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. ఒక జెపి ఉన్నా లేకున్నా నీతికి, ధర్మానికి, స్వేచ్ఛకు, విశ్వసనీయతకు, నిజాయితీ గెలుస్తుందని ఆయన అన్నారు. తమకు సంఖ్యాబాలం లేకున్నా నిజాయితీ ఉందని, అది కావాలని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజల హక్కుల కోసం, వనరుల కోసం తాము మొదటి నుంచీ పోరాడుతున్నామని ఆయన చెప్పారు. తాము ఈ విషయాన్ని ఆచరణలో కూడా చూపిస్తున్నామని ఆయన చెప్పారు. అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని అడ్డుకోలేరని, స్వేచ్ఛను అరికట్టలేరని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రమే కావాలంటే సామరస్యపూర్వకంగా, శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేయవచ్చునని, కానీ ఇటువంటి పద్ధతి సరికాదని ఆయన అన్నారు. తనను పరామర్శించిన నేతలకు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై జరిగిన దాడికి నిరసనను శాంతియుత పద్ధతుల్లో, పరుష పదజాలం వాడుకుండా తెలియజేయాలని ఆయన కోరారు.

అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ ఇతరుల హక్కును కూడా పరిరక్షించాలని ఆయన సూచించారు. మనసులోని అధర్మప్రవృత్తి ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తుందని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ధర్మబద్దంగా తాము వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు. ఈ రోజు జరిగిన సంఘటనలాంటివి దేశంలో జరుగుతూనే ఉన్నాయని, అవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించాయని ఆయన అన్నారు. రాజధాని మారినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందా అని ఆయన అడిగారు.

English summary
Loksatta president, MLA Jayaprakash Naryana said he has not complained against any body on attack and is not going 
 
 to complain. He said that the incidents like this hamper the democratic process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X