హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ దీక్ష కొనసాగుతుంది, భగ్నం చేయడానికే ప్రకటన: అంబటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Ambati Rambabu
హైదరాబాద్: మాజీ పార్లమెంటు వైఎస్ జగన్మోన్ రెడ్డి దీక్షను భగ్నం చేయడానికే ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై తప్పుడు ప్రకటనలు ఇస్తుందని జగన్ వర్గం నేత అంబటి రాంబాబు శుక్రవారం అన్నారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, పితాని సత్యనారాయణ వెయ్యి కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే దీనిని అంబటి కొట్టి పారేశారు. జగన్ దీక్షను భగ్నం చేయడానికే ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేస్తుందన్నారు. ప్రభుత్వం ప్రకటన విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను మోసం చేసే విధంగా ఉందని చెప్పారు. అయితే ప్రభుత్వం చర్యలకు విద్యార్థులు మోసపోవడానికి సిద్ధంగా లేరని అన్నారు.

ఇలాంటి ప్రకటనలతో జగన్ తన దీక్షను విరమించరన్నారు. 3400 కోట్ల రూపాయలను విడుదల చేసే వరకు జగన్ దీక్ష కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం చర్యలు కూడా కళాశాల యాజమాన్యాలను రెండుగా చీల్చినాయన్నారు. కొన్ని కళాశాల యాజమాన్యాలతో మాత్రమే ప్రభుత్వం చర్చలు జరిపి బలవంతంగా ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, అందరూ ఒప్పుకోవడం లేదని ఆరోపించారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp Senior leader Ambati Rambabu condemned Minister statement on fee reimbursements today. He accused government statement is cheating. He confiremed that Jagan deeksha will continue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X