హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ ఫీజు పోరు దీక్ష ఎఫెక్ట్: రీయింబర్స్‌మెంట్స్‌పై దిగొచ్చిన ప్రభుత్వం

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫీజుపోరు దీక్ష ప్రభావానికి ప్రభుత్వం దిగి వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌పై ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రభుత్వానికి శుక్రవారం జరిగిన చర్చలు సఫలమయ్యాయి. కళాశాలలకు బాకీ ఉన్న మొత్తంలో ఇరవై అయిదు శాతం డబ్బును చెల్లించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. కళాశాలలకు వెయ్యికోట్ల రూపాయలను చెల్లించేందుకు మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించింది.

గత సంవత్సరం 2100 కోట్ల రూపాయలు చెల్లిస్తే, ఈ సారి 3300 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ ఉన్నాయని మంత్రి పితాని సత్యనారాయణ చెప్పారు. ఏప్రిల్, మేలోగా 25శాతం బకాయిలు చెల్లిస్తామని చెప్పారు. త్వరలో ఫీజులు విడుదల చేస్తామన్నారు. అందుకు ఇంజినీరింగ్ కళాశాలలు కూడా ఒప్పుకున్నాయని చెప్పారు. ప్రభుత్వం బకాయిలి విడుదలకు సిద్ధపడటంతో ఇంజినీరింగ్ కళాశాలలు ఈ నెల 24 నుండి విడుదల చేయాలనుకున్న కళాశాలల మూసివేతను విరమించుకోనే యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

English summary
Kirankumar Government has affected by Ex MP YS Jaganmohan Reddy Fee Poru deeskha. Minister Pitani 
 
 Satyanarayana said today in media conference at Assembly that govement is ready to release Fee dues of 
 
 Engineering Colleges today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X