హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకురాలు, బిజెపి అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మరణించారు. వనం ఝాన్సీ మరణంతో రాష్ట్రం దిగ్భ్రాంతికి లోనయ్యింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని బిజెపి నేతలు అంటున్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. శుక్రవారం ఆమన్‌గల్ మండలంలోని ఓ గ్రామంలో ఆంజనేయస్వామి విగ్రహం ప్రతిష్టా కార్యక్రమానికి ఆమె వెళ్లారు. రాత్రి కావటంతో అచ్చంపేటలో రాత్రి బస చేశారు. ఆ తర్వాత ఉదయాన్నే హైదరాబాద్‌కు తిరుగు కారులో ప్రయాణం అయ్యారు. ఆమన్‌గల్ మండలం కడ్తాల్ వద్దకు వచ్చిన తర్వాత వెనుక నుండి వచ్చిన ఇన్నోవా కారు ఝాన్సీ ఉన్న కారును ఢీకొట్టింది.
దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే హైదరాబాద్ కంచెన్‌భాగ్ డిఆర్‌డీవోలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి తరలించేలోపే మార్గమధ్యలో మరణించారు. కారులో ఆయనతో పాటు ప్రయాణిస్తున్న మరొకరు, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వనం ఝాన్సీ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. రాష్ట్ర మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా, అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆమెపై ఎలాంటి విమర్శలు లేకపోవడం విశేషం.
BJP senior leader Vanam Jhansi died in road accident in Mahabubnagar. Jhansi went achampet yesterday. A Innova dashed Jhansi's car on Saturday morning while she returning to Hyderabad.
Story first published: Saturday, February 19, 2011, 12:43 [IST]