వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మావోయిస్టులు, ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలకు బయలుదేరిన హరగోపాల్

పోలీసుల అదుపులో ఉన్న ఆర్‌కె భార్య పద్మతో పాటు మరో నలుగురిని, గంటి ప్రసాద్‌ను, నల్లమలలో కూంబింగ్‌ను ఆపడం వంటి పలు డిమాండ్లు మావోయిస్టులు ప్రభుత్వం ముందు ఉంచారు. అయితే ఈరోజు మధ్యాహ్నం హరగోపాల్ నవీన్ ప్రభుత్వంతో చర్చలు జరిపిన అనంతరం ప్రభుత్వం ఏఏ డిమాండ్లకు ఒప్పుకుంటుందో తెలిసే అవకాశం ఉంది. కానీ మావోల అన్ని డిమాండ్లను మాత్రం అంగీకరించేందుకు సిద్ధంగా లేనట్లుగా తెలుస్తోంది. ఈరోజు సాయంత్రంగానీ, రేపు గానీ హరగోపాల్ మావోయిస్టులతో చర్చలు జరిపే అవకాశం ఉంది.