వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్ని డిమాండ్లు ఒప్పుకోవాలి!: ఒరిస్సా ప్రభుత్వానికి హరగోపాల్ విజ్ఞప్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Orissa govt
భువనేశ్వర్: ఇటీవల మావోయిస్టులు కిడ్నాప్ చేసిన మల్కాన్‌గిరి కలెక్టర్ వినీల్ కృష్ణ, మరో ఇంజినీరును విడిపించేందుకు మధ్యవర్తులుగా వెళ్లిన మానవ హక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ సోమేశ్వర్‌రావు ఆదివారం మధ్యహ్నం ఒరిస్సా ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు మావోయిస్టుల అన్ని డిమాండ్లకు ప్రభుత్వం ఒప్పుకోవాల్సిందేనని కోరారు. జైళ్లలో మగ్గుతున్న మావోయిస్టులకు బెయిలు ఇస్తామన్న నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వాదనను వారు తిరస్కరించినట్లుగా సమాచారం.

వారికి బెయిలు ఇస్తే సరిపోదని, వారిపై ఉన్న ఆరోపణలు అన్నీ వెనక్కి తీసుకోవాల్సిందేనని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. అంతకుముందు హైదరాబాదునుండి బయలు దేరిన హరగోపాల్, సోమేశ్వర్ మధ్యాహ్నం భువనేశ్వర్‌కు చేరుకున్నారు. ఒరిస్సా హోం సెక్రెటరీ బెహెరా, పంచాయితీరాజ్ సెక్రెటరీ త్రీపాఠీలు చర్చించారు. ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకురామని, కేవలం మేము మధ్యవర్తులం మాత్రమేనని హరగోపాల్ వ్యాఖ్యానించారు.

English summary
The much-awaited talks between the Orissa government and mediators chosen by Maoists began in Bhubneswar on 
 
 Sunday for the release of abducted Malkangiri district collector R V Krishna and an engineer. Haragoapl urged gov. to 
 
 accept all demands.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X