హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపటి నుంచి 48 గంటల పాటు తెలంగాణ బంద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణకు మద్దతుగా రేపటి నుంచి 48 గంటల పాటు తెలంగాణ బంద్ జరగనుంది. బంద్‌ను విజయవంతం చేయాలని తెలంగాణ జెఎసిల చైర్మన్ కోదండరామ్ కోరారు. తెలంగాణ విద్యార్థులపై పోలీసు కాల్పులను, లాఠీ చార్జీని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. బంద్‌లో ప్రైవేట్ సంస్థలు కూడా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ర్యాలీలను, ధర్నాలను అనుమతించాలని, అలా అనుమతించకపోవడం అమానుషమని ఆయన అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన చెప్పారు. బంద్‌కు మద్దతుగా హైదరాబాదులో రేపు (మంగళవారం) ఆటోలు నడవడం లేదు. బంద్‌కు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) మద్దతు ప్రకటించింది. కాస్తా ఇబ్బంది అయినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం భరించాలని తెరాస నాయకుడు శ్రవణ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆర్టీసి, సింగరేణి ఉద్యోగ సంఘాలు కూడా బంద్‌కు సహకరించాలని కోదండరామ్ కోరారు. బంద్‌కు తెలుగుదేశం తెలంగాణ ఫోరం కూడా మద్దతు తెలిపింది.

English summary
Telangana JAC chairman Kodandaram appealed to the people to make success 48 hours Telangana bandh from 
 
 tommorrow onwards. He condemned arrest of Telangana students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X