వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్లధనంపై చర్చ జరుగుతోంది: రాష్ట్రపతి ప్రతిభా పాటిల్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Pratibha Patil
న్యూఢిల్లీ: అవినీతిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం అన్నారు. ప్రతిభా పాటిల్ సోమవారం ప్రారంభం అయ్యే బడ్జెట్ సమావేశాలలో ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కామన్వెల్తు క్రీడలను విజయవంతంగా నిర్వహించామన్నారు. మన క్రీడాకారులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఎక్కువ పథకాలు సాధించిందన్నారు. దేశంలో వామపక్ష తీవ్రవాదం పెరుగుతోందన్నారు. జల సంరక్షణపై ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపడుతుందన్నారు. న్యాయవ్యవస్థలో పారదర్శకత ఉండాలని, సంస్కరణలు కూడా ఆవశ్యమని సూచించారు.

మారుతున్న కాలాన్ని బట్టి స్వేచ్చా వాణిజ్యం తప్పనిసరి అని చెప్పారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని మన దేశానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఇటీవలి కాలంలో నల్లధనంపై చర్చ బాగా జరుగుతోందన్నారు. ఆహార ధాన్యాల ధరలు అందుబాటులో ఉన్నాయన్నారు. నూనె గింజలు, పప్పు ధాన్యాల ఉత్పత్తికి ప్రత్యేక ప్రణాళికతో కేంద్రం ముందుకు వెళుతుందన్నారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులకు సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పారు. పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.

English summary
President Pratibha Patil assured Joint Parliamentary session today that action on black money will be taken. She expressed happy that Common Wealth Games were organized successfully.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X