వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

24వ తేదీ వరకు ప్రభుత్వానికి గడువు ఇచ్చిన తెలంగాణ ఉద్యోగులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి 24వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు తెలంగాణ ఉద్యోగుల సంఘాల జెఎసి నాయకుడు స్వామి గౌడ్ చెప్పారు. తెలంగాణ ఉద్యోగుల జెఎసి ప్రతినిధులతో మంత్రివర్గం ఉపసంఘం జరిపిన చర్చలు సోమవారం విఫలమయ్యాయి. తెలంగాణ ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం కొనసాగుతుందని తాము స్పష్టం చేసినట్లు స్వామిగౌడ్ చెప్పారు. తెలంగాణ అంశం తమ పరిధిలో లేదని మంత్రి వర్గ ఉపసంఘం సభ్యులు చెప్పారని, ఆందువల్ల సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించాలని కోరారని, అయితే తాము అందుకు నిరాకరించామని ఆయన చెప్పారు.

తెలంగాణ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేకపోతే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ప్రతినిధులను ఢిల్లీ తీసుకుని వెళ్లాలని, ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తోనూ కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతోనూ భేటీ ఏర్పాటు చేయాలని కోరామని, ఇందుకు ఈ నెల 24వ తేదీ వరకు గడువు ఇచ్చామని, అయితే సహాయ నిరాకరణ ఉద్యమం మాత్రం ఆపబోమని ఆయన చెప్పారు. హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై రాష్ట్రపతి ఆమోద ముద్ర కావాలని, 610 జీవోకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని, తెలంగాణ ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

English summary
Talks between Telangana employees and Cabinet sub committee failed today. TNGOs rejected to withdraw civil 
 
 disobedience movement. Telangana issue should be solved, it demanded. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X