వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంటును తాకిన తెలంగాణ సెగ: ఫ్లకార్డుల ప్రదర్శన

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshav Rao
న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాలలో తెలంగాణ ఉద్యమ సెగ పార్లమెంటుకూ తాకింది. పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రారంభోత్సవ స్పీచ్ చేసిన అనంతరం ఆమె వెళ్లే దారిలో తెలంగాణకు చెందిన కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఎంపీలు తెలంగాణ ఫ్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగంలో తెలంగాణ అంశం లేకపోవడంతో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలతో పాటు, తెలుగుదేశం పార్టీకి చెందిన తెలంగాణ ఎంపీలు గుండు సుధారాణి, రమేష్ రాథోడ్‌లు గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

కాగా అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె కేశవరావు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావును తెలంగాణ కోసం తమతో కలిసి రమ్మంటే ఆయన మాత్రం రావడం లేదన్నారు. టిడిపి తెలంగాణ కోసం కాంగ్రెస్‌తో కలిసి మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ధర్నా చేసిందని, ఇది తెలంగాణకు శుభపరిణామమని అన్నారు. ఇటీవల ఎమ్మెల్యేలు తెలంగాణపై స్పష్టత కోసం వచ్చారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీని కలవడానికి రాలేదన్నారు. కేంద్ర మంత్రులనుండి తెలంగాణపై స్పష్టమైన వైఖరి లేకుంటేనే సోనియాగాంధీని కలుస్తామని చెప్పారని, అయితే మంత్రులనుండి స్పష్టమైన వైఖరి లభించినందునే వారు సోనియాకాంధీని కలవలేదన్నారు.

టిఆర్ఎస్ సిరిసిల్ల శాసనసభ్యుడు కె తారకరామారావు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విమర్శించడం సరికాదన్నారు. ఆయన ఆరోపించినట్లు వారు సోనియా అపాయింట్‌మెంట్ కోసం రాలేదని వివరణ ఇచ్చారు. అందరూ కలిసి పోరాడితేనే తెలంగాణ వస్తుందని అన్నారు. రాష్ట్రంలో తెలంగాణ సమస్య పరిష్కారం కాదని, ఒత్తిడి తేవాలనుకుంటే న్యూఢిల్లీలో తీసుకు రావాలని ఆయన కేసిఆర్‌కు సూచించారు. సోనియా నాయకత్వాన్ని బలపరుస్తూనే నిరసన తెలిపాం అని చెప్పారు.

English summary
Telangana TDP and Congress MPs played placards before president Pratibha Patil in Parliament budget session today. They took up deeksha at Mahatma Gandhi statue opposing president's speech without Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X