హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీలోకి దూసుకెళ్లిన విద్యార్థులు, పోలీసులతో ఘర్షణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: విద్యార్థులు తలపెట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యార్థుల రన్నింగ్, పోలీసుల ఛేజింగ్, లాఠీఛార్జీలు, రబ్బరు బుల్లెట్లను చీల్చుకొని సుమారు పది పదిహేను మంది విద్యార్థులు అసెంబ్లీలోకి దూసుకెళ్లి తమ తెలంగాణ ఆకాంక్షను నిరూపించుకున్నారు. విద్యార్థులు అసెంబ్లీ దూసుకు పోవడం పట్ల పోలీసులు అవాక్కయిపోయారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కొందరు విద్యార్థులు పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీలోకి దూసుకు వెళ్లారు. కౌన్సిల్‌కు వెళ్లే దారిలో వారు బైఠాయించారు.

పూర్తి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, ఇంతవరకు ఎన్నడూ లేని విధంగా పోలీసు బలగాలను అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో పెట్టినప్పటికీ అంతమంది విద్యార్థులు అసెంబ్లీలోకి దూసుకు పోవడంతో పోలీసులు చేష్టలుడిగి పోయారు. కాగా అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకోవడంతో రెచ్చిపోయిన విద్యార్థులు రాజధానిలో సుమారు 8 బస్సులను ధ్వంసం చేశారు. హబ్సిగూడలో 8 బస్సులను ధ్వంసం చేసి ఒక బస్సుకు నిప్పు పెట్టారు. రామాంతాపూర్‌లో కూడా మరో బస్సును ధ్వంసం చేశారు. కొందరు విద్యార్థులు తార్నాకలోని వరుణ్ మోటార్‌ దుకాణం అద్దాలను ధ్వంసం చేశారు.

English summary
Around ten to fifteen students entered into Assembly today. Students succesded Chalo Assembly through 
 
 Govenment put full police security in Assembly premises.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X