వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెసిఆర్ ఆందోళనకు దీటుగా కాంగ్రెసు తెలంగాణ ఎంపీల వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Congress
న్యూఢిల్లీ‌: లోకసభలో బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు మాట్లాడనున్న నేపథ్యంలో తాము ఏం చేయాలనే విషయంపై కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నారు. కెసిఆర్‌కు దీటుగా తాము వ్యవహరించాలని వారు చూస్తున్నారు. పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా ఉండకుండా కెసిఆర్‌కే క్రెడిట్ అంతా దక్కకుండా ఏం చేయాలనేది వారికిప్పుడు ప్రధాన సమస్యగా ఉంది. ఈ స్థితిలో వారు మంగళవారం సమావేశమై వ్యూహాన్ని ఖరారు చేసినట్లు సమాచారం.

గవర్నర్ నరసింహన్‌ను తొలగించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసింహన్ స్థానంలో మరొకరిని గవర్నర్‌గా నియమించాలని ఆయన కోరారు. ఈ మేరకు రేపు బుధవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌కు వినతిపత్రం సమర్పించాలని కాంగ్రెసు తెలంగాణ పార్లమెంటు సభ్యులు నిర్ణయించారు. తమకూ కెసిఆర్‌కు మధ్య పోలిక లేదని వారన్నారు. బిజెపి చేతకానిదని, అందుకే తమ కాంగ్రెసుపై విమర్శలు చేస్తోందని వారన్నారు. మూడు కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలోనే తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటు చేయలేదని వారు బిజెపిని ప్రశ్నించారు.

English summary
Congress Telangana MPs chalked out strategy to face TRS MP KCR on Telangana issue in Loksabha tomorrow. They demanded Central government to recall governor Narasimhan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X