హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ తీర్మానం పెట్టే వరకు సభ అడ్డుకుంటాం: ఈటెల

By Srinivas
|
Google Oneindia TeluguNews

Etala Rajender
హైదరాబాద్: అసెంబ్లీలో తెలంగాణ తీర్మానం పెట్టే వరకు శాసనసభ సమావేశాలు తాము జరగనిచ్చేది లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి పక్ష నేత ఈటెల రాజేందర్ మంగళవారం మీడియా పాయింట్ వద్ద విలేకరుల ప్రతినిధులతో మాట్లాడుతూ హెచ్చరించారు. తెలంగాణ అంశాన్ని పక్కన పెట్టేందుకే ప్రభుత్వ ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ను తెరపైకి తీసుకు వస్తుందన్నారు. గత డిసెంబర్ 9న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మేరకే మేం శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని కోరుతున్నామని అన్నారు. తెలంగాణ తీర్మానం ఖచ్చితంగా ప్రవేశ పెట్టాల్సిందేనని అన్నారు.

సుప్రీంకోర్టు ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ విడుదల చేయమని చెప్పిందని కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటే సరిపోతుందన్నారు. తెలంగాణ సమస్యను పక్కదారి పట్టించడానికి ఫీజు సమస్యను తీసుకు రావడం సమంజసం కాదన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌ ఓ దొంగ నాటకం అని ఆరోపించారు. సభలో అన్ని విపక్షాలు నిరసన తెలియజేస్తున్నప్పటికీ వారిని పక్కకు నెట్టి మాట్లాడే దుష్ట సాంప్రదాయానికి అధికార పార్టీ తెరతీసిందన్నారు. ప్రభుత్వం సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తుందన్నారు.

English summary
TRSLP leader Etela Rajender warned government they will stall assembly proceeding till government proposes Telangana resolution in assembly. He suggested government to follow supreme court orders on fee reimbursement.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X