వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోద్రా అల్లర్ల కేసులో 31 మందిని దోషులుగా నిర్ధారించిన ప్రత్యేక కోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Godhra Verdict
అహ్మదాబాద్: గోద్రా అల్లర్లు, సబర్మతి ఎక్స్‌ప్రెస్ రైలు దగ్ధం కేసులో ప్రత్యేక కోర్టు 31 మందిని దోషులుగా నిర్ధారించింది. వారికి కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే, శిక్షా కాలాన్ని ఈ నెల 25వ తేదీన నిర్ధారించనున్నట్లు కోర్టు తెలిపింది. 63 మందిని నిర్దోషులుగా ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని నిర్దోషులుగా ప్రకటించింది. 2002 ఫిబ్రవరి 27వ తేదీన సబర్మతి ఎక్స్‌ప్రెస్‌ ఎస్6 కోచ్‌కు గుజరాత్‌లోని గోద్రా సమీపంలో దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో 59 మంది మరణించారు. తొమ్మిదేళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడింది.

రైలు బోగీ దగ్ధం తర్వాత గుజరాత్‌లో పెద్ద యెత్తున నాలుగు నెలల పాటు మత ఘర్షణలు చెలరేగాయి. ఇందులో దాదాపు 1,200 మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ముస్లింలే ఉన్నారు. తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కోర్టు వద్ధ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం 104 మందిపై కేసులో విచారణ చేపట్టారు.

English summary
In a long-due verdict, a special fast track court here on Tuesday found 31 accused guilty of involvement in the Godhra train burning case in which 59 people were burnt to death, triggering the 2002 communal violence in Gujarat. The court found the 31 accused guilty of criminal conspiracy, while letting off 63 other accused.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X