హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

48 గంటల తెలంగాణ బంద్ ప్రారంభం, ఎక్కడి బస్సులు అక్కడే

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 48 గంటలపాటు బంద్‌కు తెలంగాణ రాజకీయ ఐకాస పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణవ్యాప్తంగా మంగళవారం ఉదయం బంద్ ప్రారంభమైంది. బస్సు డిపోల ముందు తెలంగాణవాదులు బైఠాయించారు. పలు జిల్లాలో తెలంగాణవాదులు బస్సులను నిలిపివేస్తున్నారు. వరంగల్‌, నిజామాబాద్‌, ఖమ్మం, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నల్గొండ, ఉప్పల్‌, రంగారెడ్డి, మెదక్‌ తదితర ప్రాంతాల్లో బస్సులు ఆయా డిపోల్లో నిలిచిపోయాయి. మహబూబ్‌నగర్‌ జడ్చర్లలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ను ఆందోళనకారులు నిలిపివేశారు. రాజేంద్రనగర్‌ ఆర్టీసీ బస్సు డిపో ముందు భాజపా నాయకులు బైఠాయించి తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు.

వరంగల్‌ జిల్లా నర్సంపేటలో బస్సు అద్దాలను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. మెదక్‌ జిల్లా సంగారెడ్డి మండలం పసలవాది గ్రామంలో రెండు ప్రైవేటు బస్సులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో సెట్విన్‌ బస్సును ధ్వంసం చేశారు. రాణిగంజ్‌ ఆర్టీసీ డిపో ముందు తెలంగాణ ఆర్టీసీ ఐకాస నాయకులు ఆందోళన చేస్తున్నారు. తెలంగాణవ్యాప్తంగా వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు మూత పడ్డాయి. పెట్రోలు బంకులు పని చేయడం లేదు. కరీంనగర్ డిపో వద్ద తెలంగాణవాదులు బైఠాయించారు.

English summary
Telangana bandh begins today. Telangana political JAC called for 48 hours bandh demanding proposal of Telangana bill in Parliament. RTC buses stopped in depots.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X