వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమైక్యాంధ్రే బెటర్: పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీల కరపత్రాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నినాదాలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి, ఎన్డీయే పక్షాలకు కౌంటర్‌గా సీమాంధ్ర పార్లమెంటుకు చెందిన పార్లమెంటు సభ్యులు సమైక్యాంధ్రకు మద్దతుగా, తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న కరపత్రాలను పార్లమెంటులో పంచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తే దేశవ్యాప్తంగా మరిన్ని ఉద్యమాలు పుట్టుకు వస్తాయని వారు ఆ కరపత్రంలో హెచ్చరించారు. ఇప్పటికే దేశంలో ఎన్నో ప్రత్యేక ఉద్యమాలు ఉన్నాయనరన్నారు. తెలంగాణ కనుక కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తే దేశవ్యాప్తంగా 24 ప్రత్యేక రాష్ట్ర డిమాండ్లు వస్తాయని హెచ్చరించారు. ప్రత్యేక తెలంగాణకు కేంద్రం ఆమోదం చెప్పకూడదన్నారు.

కాగా రాయలసీమకు చెందిన ఎంపీ వెంకటరామిరెడ్డి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమైక్యమే బెటర్ అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమే కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం తెలంగాణ మాత్రమే వెనుక పడలేదన్నారు. ఉత్తరాంధ్ర, తెలంగాణ కంటే రాయలసీమ ఎంతో వెనుకబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయం ప్రకటించాలని ఆయన కోరారు. రాష్ట్రం అన్నింటిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే సమైక్యంగానే ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రాన్ని చీల్చడం మంచిది కాదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశమే లేదన్నారు.

English summary
Seemandhra Parliament Members distributed pamphlets in Parliament opposing Telangana and supporting United Andhra Pradesh today. Rayalaseema MP Anantha Venkatarami Reddy opposed separate Telangana in a news channel interview.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X