వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
సమైక్యాంధ్రే బెటర్: పార్లమెంటులో సీమాంధ్ర ఎంపీల కరపత్రాలు

కాగా రాయలసీమకు చెందిన ఎంపీ వెంకటరామిరెడ్డి ఓ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమైక్యమే బెటర్ అన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక ప్రకారమే కేంద్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. కేవలం తెలంగాణ మాత్రమే వెనుక పడలేదన్నారు. ఉత్తరాంధ్ర, తెలంగాణ కంటే రాయలసీమ ఎంతో వెనుకబడి ఉందన్నారు. వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక సహాయం ప్రకటించాలని ఆయన కోరారు. రాష్ట్రం అన్నింటిలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే సమైక్యంగానే ఉండాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిపై కేంద్రం దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రాన్ని చీల్చడం మంచిది కాదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించే అవకాశమే లేదన్నారు.