హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రెండో రోజూ కొనసాగుతున్న తెలంగాణ బంద్, ఆగిన బస్సులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ రాజకీయ జెఎసి ఇచ్చిన 48 గంటల బంద్‌ బుధవారం రెండోరోజూ కొనసాగుతోంది. తెలంగాణ జిల్లాల్లో ఆర్టీసి బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. బస్సు డిపోల ముందు తెలంగాణవాదులు ధర్నాలకు దిగారు. తెలంగాణ బంద్‌కు మద్దతుగా నేడు ఆటోడ్రైవర్ల జెఎసి కార్యకర్తలు అసెంబ్లీని ముట్టడించనున్నారు. బంద్‌ సందర్భంగా తెలంగాణలో రవాణా స్తంభించింది. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ బస్‌స్టేషన్‌కు తాళాలు వేసి ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు.

ఖమ్మం, నల్గొండ, మెదక్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, రంగారెడ్డి తదితర ప్రాంతాల్లో బస్సులు నిలిచిపోయాయి. రంగారెడ్డి ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌ కౌంటర్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. వెంటనే సిబ్బంది మంటలు ఆర్పేశారు. బంద్‌ సందర్భంగా మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్‌ - ఫలక్‌నుమా మార్గంలో ఎంఎంటీఎస్‌ రైళ్లను రద్దు చేశారు.మంగళవారం తెలంగాణ బంద్ సంపూర్ణంగా జరిగింది. విద్యా సంస్థలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి.

English summary
Telangana bandh is continuing second day today. Telangana political JAC has given call for 48 hours bandh demanding proposal of Telangana bill in Parliament. All sections of the Telangana society participated in band on tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X