వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ ఎంపీలకు కావూరి సాంబశివ రావు కౌంటర్ వ్యూహం

By Pratap
|
Google Oneindia TeluguNews

Kavuri Sambhasiva Rao
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు కోసం లోకసభలో ప్రతిపక్షాలతో పాటు తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు కూడా పట్టుబడుతున్న నేపథ్యంలో వారి ప్రయత్నాలకు గండి కొట్టేందుకు కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు వ్యూహరచన చేశారు. బుధవారం రాత్రి తన నివాసంలో ఇతర సీమాంధ్ర పార్లమెంటు సభ్యులతో సమావేశమై వారిని ఎదుర్కునేందుకు వ్యూహాన్ని రచించారు. సమైక్యాంధ్ర దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సీమాంధ్ర ఎంపీలు సిద్ధమవుతున్నారు. కేంద్ర మంత్రులు సాయిప్రతాప్‌, పురందేశ్వరి, పనబాక లక్ష్మీలతోపాటు కేవీపీ రామచంద్రరావు, లగడపాటి రాజగోపాల్‌, సబ్బంహరి, కిల్లి కృపారాణి, కనుమూరి బాపిరాజు, అనంత వెంకట్రామిరెడ్డి, ఉండవల్లి అరుణ్‌కుమార్‌, జేడీ శీలం పాల్గొన్న ఈ సమావేశంలో శ్రీకృష్ణ కమిటీ నివేదికపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది.

శ్రీకృష్ణ కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినందున కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయాలు ఆలోచించకూడదన్న అభిప్రాయం వ్యక్తమైంది. పార్టీ పెద్దలందరినీ కలిసి ఇదే విషయాన్ని చెప్పాలని, ప్రభుత్వంపై కూడా ఒత్తిడి తేవాలని ఎంపీలు నిర్ణయించారు. వచ్చే ఒకటి రెండు రోజుల్లో ఈ పనిని పూర్తిచేస్తారని తెలుస్తోంది. సమావేశం అనంతరం ఎంపీ కావూరి సాంబశివరావు విలేకరులతో మాట్లాడుతూ.. శ్రీకృష్ణ కమిటీ నిజాయితీగా ఇచ్చిన నివేదికను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకోవాలని, దీనిపై జాప్యం తగదని అన్నారు.

ఆలస్యమైతే రాష్ట్రానికీ, ప్రజలకూ నష్టం జరుగుతుందని అన్నారు. జాప్యం వల్ల అన్నదమ్ముల్లా ఉన్న ప్రజల మధ్య విభేదాలు పెరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పారు. ప్రధాని, ప్రణబ్‌ ముఖర్జీ, అహ్మద్‌ పటేల్‌లను కలిసి విషయాన్ని వివరిస్తామని శ్రీకృష్ణ కమిటీ నివేదిక నేపథ్యంలో ప్రభుత్వం తీసుకునే సముచిత నిర్ణయానికి తమ ఆమోదం ఉంటుందని ఆయన అన్నారు. సమావేశానికి 13 మంది ఎంపీలు హాజరయ్యారని, రానివాళ్లు ఫోన్‌ చేసి మాట్లాడారని, అందరూ ఒకే అభిప్రాయంతో ఉన్నారని తెలిపారు.

English summary
Congress Seemandhra MPs met yesterday night at Kavuri Samabasiva Rao's residence to counter Telangana MPs on Telangana issue. They decided to put pressure on high command to take decision in favour of united andhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X