హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీరప్ప మొయిలీపై కాంగ్రెసు తెలంగాణ ఎమ్మెల్యేల ఫైర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Veerappa Moily
హైదరాబాద్: తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీపై కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ విషయంలో మొయిలీ వ్యాఖ్యలను వారు వ్యతిరేకించారు. తెలంగాణ అంశంపై అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు వారు గురువారం సమావేశమయ్యారు. కేంద్ర న్యాయశాఖ మంత్రిగా ఉంటూ తెలంగాణ బిల్లును ప్రతిపాదించబోమని మొయిలీ ఎలా చెబుతారని వారు అడిగారు. న్యాయ శాఖ మంత్రిగా మొయిలీని తొలగించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ మంత్రులు తెలంగాణపై సోనియాకు ఓ లేఖ రాసి మిన్నకుండడం కాకుండా కార్యాచరణకు దిగాలని వారంటున్నారు.

తమ పార్టీ పార్లమెంటు సభ్యుల మాదిరిగానే తాము కూడా రేపటి నుంచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్లు కాంగ్రెసు తెలంగాణ శానససభ్యుడు రాజయ్య మీడియా ప్రతినిధులు చెప్పారు. లోకసభలో తమ పార్టీ తెలంగాణ ప్రాంత లోకసభ సభ్యులు వ్యవహరించిన తీరును ఆయన అభినందించారు. తెలంగాణపై లోకసభ సభ్యులు పూర్తి చిత్తశుద్ధితో వ్యవహరించారని ఆయన చెప్పారు. తాము కూడా రేపటి నుంచి శాసనసభలో ఆందోళనకు దిగుతామని ఆయన చెప్పారు. సమావేశానికి రాని శాసనసభ్యులతో కూడా సమావేశానికి హాజరైన తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు మాట్లాడారు. శానససభ సమావేశమైనప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.

English summary
Congress Telangana region MLAs condemned central minister Veerappa Moily's statement on Telangana. Congress Telangana region MLA Rajaiah said that his party MLAs from Telangana will fight for Telangana in assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X