హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సహాయ నిరాకరణలో పోలీసులు? కెటిఆర్ వ్యాఖ్యలపై డిజిపి ఖండన

By Srinivas
|
Google Oneindia TeluguNews

Aravinda Rao
హైదరాబాద్: సహాయనిరాకరణలో పోలీసులు కూడా పాల్గొని మద్దతు తెలుపుతున్నారన్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని, అదంతా అవాస్తవమని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరవింద్ రావు గురువారం స్పష్టం చేశారు. మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర సమితి సిరిసిల్ల శాసనసభ్యుడు కల్వకుంట్ల తారకరామారావు మెదక్ జిల్లాలో పోలీసులు కూడా సహాయ నిరాకరణలో పాల్గొనడం అభినందనీయమని తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పారు. దీనిపై స్పందించిన డిజిపి ఆ వ్యాఖ్యలను ఖండించారు.

తెలంగాణ జిల్లాల్లో పోలీసులు సహాయ నిరాకరణ తెలపడం లేదని చెప్పారు. ఆ వార్తలు అవాస్తవం అని చెప్పారు. కేవలం మెదక్ జిల్లాలోని ఎస్పీ కార్యాలయంలోని సిబ్బంది మాత్రమే సహాయ నిరాకరణలో పాల్గొన్నారని స్పష్టం చేశారు. అయితే పోలీసులు ఎక్కడా తిరుగుబాటు చేయలేదన్నారు.

English summary
DGP Aravind Rao condemned today TRS MLA KT Ramarao comments on police in Non Co-Operation movement. He confirmed that only Medak SP office staff participated.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X