హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టించుకోని కిరణ్ కుమార్ ప్రభుత్వం, ఉడికిపోతున్న వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం వారం రోజుల పాటు దీక్ష చేస్తున్న మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ దీక్షను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన దీక్షను పూర్తిగా విస్మరించింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ చెల్లింపులకు సంబంధించి ప్రకటన చేస్తూ జగన్ దీక్ష విమరించాలని మంత్రి పితాని సత్యనారాయణ అన్నారు. అంతకు ముందు మంత్రి బొత్స సత్యనారాయణ వ్యంగ్యంగా జగన్ దీక్ష చేస్తున్నారా, ఎక్కడ, ఎప్పుడు అని అడిగారు. ఈ రెండు ప్రస్తావనలు తప్ప జగన్ దీక్షకు సంబంధించిన ప్రస్తావనేది ప్రభుత్వం వైపు నుంచి రాలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అసెంబ్లీ వరకు పాదయాత్ర చేసి, దుమ్మెత్తి పోసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

వైయస్ జగన్ దీక్ష గురువారం ఏడో రోజుకు చేరుకుంది. ఆయన ఆరోగ్యం క్షీణించింది. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని జగన్ వర్గం నాయకులు విమర్శిస్తున్నారు. దీక్ష చేస్తున్న జగన్ వద్దకు ప్రభుత్వం తన ప్రతినిధిని పంపాలనే కనీస మర్యాదను కూడా పాటించడం లేదని వారు ఆడిపోసుకుంటున్నారు. ఆయన గురువారం సాయంత్రం దీక్షను విరమించనున్నారు. దీక్ష విరమించే సమయంలో జగన్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడే అవకాశం ఉంది.

English summary
CM Kiran Kumar Reddy's government ignored YS Jagan, who is doing fast since seven days demanding release of fee reimbursement. YS Jagan camp leaders lashing out at government for ignoring deeksha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X