హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దీక్ష విషయంలో చంద్రబాబుపై శ్రద్ధ జగన్‌పై ఏది: ఎంపీ మేకపాటి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mekapati Rajamohan Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గత వారం రోజులుగు విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రభుత్వం వెంటనే ఫీజులు చెల్లించాలంటూ నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి స్పందించక పోవడం విచారకరమని జగన్ వర్గం నెల్లూరు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గురువారం దీక్షా శిబిరం వద్ద ధ్వజమెత్తారు. నిరాహార దీక్ష చేపడితే మంత్రులను పంపించి చర్చలు జరిపి వారితో దీక్షను విరమింప జేయడానికి ప్రభుత్వం ఇంతకుముందు చూసేదని కానీ జగన్ విషయంలో మాత్రం ప్రభుత్వం ఏమాత్రం స్పందించక పోవడం విచారకరమన్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా దీక్ష చేపట్టినప్పుడు ప్రభుత్వం మంత్రివర్గాన్ని పంపించి దీక్షను విరమింప జేసిందని గుర్తు చేశారు. ఇంతకుముందు కూడా అన్ని అలాగే జరిగాయన్నారు.

జగన్ ప్రభుత్వంపై చేస్తున్న ఈ యుద్ధం చివరిది కాదని, ఇదే ఆరంభమని హెచ్చరించారు. బడ్జెట్‍‌లో ఫీజు రీయింబర్స్‌మెంట్స్‌కు సరియైన నిధులు కేటాయించలేదన్నారు. గత బకాయిలో 3500 కోట్ల రూపాయలు ఉంటే మరి ఇప్పుడు కొత్తవి, పాతవి కలిసి ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు.

English summary
Ex MP YS Jaganmohan Reddy camp parliament member Mekapati Rajamohan Reddy warned CM Kiran Kumar Reddy government today. He accused government is not caring about Jagan health. He said its very unfortunate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X