హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు ఎమ్మెల్యేలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం: కోదండరామ్

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యులను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని తెలంగాణ జెఎసి స్టీరింగ్ కమిటీ చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణ జెఎసి గురువారం సమావేశమైన తన కార్యాచరణను ఖరారు చేసుకుంది. ఈ కార్యచరణను కోదండరామ్ మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యే వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని ఆయన చెప్పారు. ఢిల్లీలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు ఉద్యమించిన విధంగానే ఆ పార్టీ శాసనసభ్యులు ఇక్కడ ఉద్యమించాలని ఆయన కోరారు. ఉద్యమం ఇంత ఉధృతంగా సాగుతుంటే కాంగ్రెసు తెలంగాణ శానససభ్యులు తగిన విధంగా స్పందించడం లేదని ఆయన విమర్శించారు.

సహాయ నిరాకరణకు సంఘీభావంగా ఈ నెల 25, 26 తేదీల్లో తెలంగాణలోని జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో ర్యాలీలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. రైల్ రోకో తేదీలను రేపు ఉదయం ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 27వ తేదీన తెలంగాణ శాసనసభ్యుల వైఖరిని నిలదీస్తూ, వారిని ఎండగడుతూ జిల్లా, డివిజన్, మండల స్థాయిల్లో మీడియా సమావేశాలు జరుగుతాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభ్యుల వైఖరే అవరోధంగా మారిందని ఆయన విమర్శించారు.

శ్రీకృష్ణ కమిటీ ఎలాంటి నివేదిక రాయాలో అలాంటి నివేదిక రాయలేదని హైకోర్టు న్యాయమూర్తే వ్యాఖ్యానించారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడితేనే ఈ ప్రాంత ప్రజలు సంతృప్తి చెందుతారని ఆయన అన్నారు. శ్రీకృష్ణ కమిటీకి చట్టబద్దత లేదని అటార్నీ జనరలే స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. ఈ నెల 28వ తేదీన మంత్రులు, కాంగ్రెసు శాసనసభ్యుల దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నట్లు ఆయన తెలిపారు.

English summary
Telangana JAC steering committee chalked out its action programme to achieve Telangana. JAC steering committee chairman Kodandaram announced its action programme in a media conference.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X