హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్‌ను శత్రువుగా చూస్తున్నారా, ప్రభుత్వంపై ధ్వజం

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం తమ నాయకుడిని శత్రువుగా చూస్తోందని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గం నాయకులు దుమ్మెత్తిపోశారు. ఏడు రోజుల పాటు దీక్ష చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వం తన ప్రతినిధులను పంపే కనీస మర్యాదను కూడా పాటించలేదని వారంటున్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మల్సీ పుల్లా పద్మావతి ఆ ఆరోపణలు చేశారు. గతంలో శాసనసభ్యురాలు కొండా సురేఖ కూడా అదే వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ను చూడడం లేదని వారు వ్యాఖ్యానించారు.

ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం వైయస్ జగన్ చేపట్టిన దీక్ష గురువారం ఏడో రోజుకు చేరుకుంది. వైఎస్.జగన్మోహన్ రెడ్డిని ఈ ప్రభుత్వం శత్రువు కంటే హీనంగా చూస్తోందని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. 26 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూర్చే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ గత వారం రోజులుగా జగన్ దీక్ష చేస్తుంటే ప్రభుత్వానికి కనీసం చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పేద విద్యార్థుల కోసం ఆరు రోజుల నుంచి నిరశన దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించినా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దారుణంగా ఉందన్నారు. శత్రువు పట్ల కూడా ఎవరూ ఈ విధంగా ప్రవర్తించరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం పట్టించుకోకపోయినా ప్రజలంతా పట్టించుకున్నారని, అదే చాలని సికింద్రాబాద్ కాంగ్రెసు శాసనసభ్యురాలు జయసుధ అన్నారు. వైయస్ జగన్‌ను ప్రతిపక్ష నేతగా భావించి ఉంటే ప్రభుత్వం తన ప్రతినిధులను పంపి దీక్ష విరమించాలని కోరేదని వారంటున్నారు. కానీ, ప్రభుత్వం జగన్ దీక్షను ఏ మాత్రం పట్టించుకోలేదు.

English summary
YS Jagan camp leaders expressed anguish at CM Kiran Kumar Reddy's regime. They alleged that Government is treating YS Jagan as enemy not as opposition leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X