హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రజల కోపాగ్నిలో ప్రభుత్వం మాడి మసి అవుతుంది: వైయస్ జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: పేద విద్యార్థులను నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వాన్ని కొనసాగినిస్తే తప్పు చేసినవారమవుతామని, ఇది సిగ్గులేని ప్రభుత్వమని మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ అన్నారు. బడ్జెట్‌ను సవరించి విద్యార్థులకు సరిపడా కేటాయింపులు జరపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. పేద ప్రజల కోపాగ్నిలో ప్రభుత్వం కొట్టుకుపోతుందని ఆయన అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ సమస్యపై ఏడు రోజుల పాటు సాగించిన దీక్షను విరమించిన తర్వాత ఆయన గురువారం సాయంత్రం ప్రసంగించారు.

ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే ఒక్క రోజు దీక్ష చాలదని, ఈ గుడ్డి ప్రభుత్వం కళ్లు తెరవాలంటే బడ్జెట్ పెట్టే సమయంలో ఒత్తిడి పెరగాలంటే తాను వారం రోజుల పాటు దీక్ష చేయాలని భావించానని ఆయన చెప్పారు. 25 లక్షల మంది పేద విద్యార్థులు 3,450 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని, మళ్లీ అంతే మొత్తం చెల్లించాల్సి ఉంటుందని, ప్రభుత్వం కేవలం 3 వేల కోట్లు మాత్రమే కేటాయించి, చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిందని ఆయన విమర్శించారు. నామమాత్రంగా కేటాయింపులు జరిపి విద్యార్థులకు ఏం సమాధానం చెప్తారని ఆయన ప్రభుత్వాన్ని అడిగారు. ఒక్క దూత కూడా తన వద్దకు రాలేదని తాను బాధపడలేదని, 25 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల మనోభావాలను దెబ్బ తీసిందని ఆయన అన్నారు.

ప్రతి పేదవాడు బాగా చదవాలని, ప్రతి పేద కుటుంబం నుంచి ఓ వ్యక్తి అయినా ఉన్నత చదువులు చదవాలని, తద్వారా ఆ కుటుంబం బాగుపడాలని తాను ఈ దీక్ష చేశానని ఆయన అన్నారు. తాను రామరాజ్యాన్ని చూడలేదు గానీ వైయస్ రాజశేఖర రెడ్డి సువర్ణ రాజ్యం చూశానని ఆయన అన్నారు. వైయస్ జగన్ చేత వరలక్ష్మి తల్లి లక్ష్మమ్మ గురువారం సాయంత్రం ఏడు రోజుల దీక్షను విరమింపజేశారు. ఆనంతరం ఆయన మాట్లాడారు.

English summary
Ex MP YS Jagan warns Government he will intensify his movement on fee reimbursement issue. He said that the Government has no right to continue. He said that Government has cheating 25 lakh students.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X