హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాసనసభను అడ్డుకుంటే ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తాం: మల్లుభట్టి

By Pratap
|
Google Oneindia TeluguNews

Mallu Bhatti Vikramarka
హైదరాబాద్: శానససభను ఇదే విధంగా అడ్డుకుంటే శాసనసభ్యులను సస్పెండ్ చేస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.రాష్ట్రంలో సమస్యలు రావడానికి, అనిశ్చితి నెలకొనడానికి కారణం బీజేపీయేనని ప్రభుత్వ ఆయన విమర్శించారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను తప్పుబట్టడం బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందని, అసలు ప్రత్యేక తెలంగాణా అక్కరలేదని ఆ రోజున అద్వానీ అన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.

ప్రజా సమస్యలపై చర్చించడానికి అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేశామని, అందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరినప్పటికీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలనే సమావేశాల్ని అడ్డుకుంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఖండించారు. ప్రజా ప్రతినిధులగా ఎన్నికై వచ్చిన ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించాలిగాని, ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్నారు.

సమావేశాల సందర్భంగా ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించాలని, ఇదంతా ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. శాసనసభలో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పినవారు సమావేశాలను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు.

English summary
Government chief whip Mallbhatti Vikramarka said that MLAs, who obstruct assembly procedings will be suspended. He opposed the MLAs attitude in distructing assembly procedings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X