• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వెనక్కి తగ్గిన వైయస్ జగన్, పోటీ చేయబోమని ప్రకటన

By Pratap
|

YS Jagan
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వెనక్కి తగ్గారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన వర్గం పోటీ చేయదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం రాత్రి ఓ బహిరంగ లేఖ రాశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ వర్గం పోటీ చేయనుందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. పార్టీ స్థాపన, కార్యవర్గాల ఏర్పాటు పూర్తయిన తర్వాత మాత్రమే ఏ ఎన్నికల్లోనైనా పోటీ చేయాలన్నదే తమ అభిప్రాయంగా ఆయన స్పష్టం చేశారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో దివంగత నేత వైఎస్ అభిమానులందరూ ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎమ్మెల్యేలు, ఉపాధ్యాయులు, గ్రాడ్యుయేట్లు, స్థానిక సంస్థల కోటా నుంచి జరగబోతున్న ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలూ తమ శక్తియుక్తుల్ని కేంద్రీకరిస్తున్నాయి. గెలవటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాయని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకొచ్చిన తనకు కాంగ్రెస్‌లోని వైఎస్సార్ అభిమానులు, జన సంక్షేమాన్ని కాంక్షించే నాయకులు బహిరంగంగానే మద్దతు పలుకుతున్న సంగతీ రోజూ మీరు చూస్తున్నదనే అని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయంగా పోరాడాలన్నా, ఏదైనా సాధించాలన్నా రాజకీయ పార్టీ అవసరం కాబట్టి వైఎస్సార్ పేరిట పార్టీ స్థాపన, దానికి సంబంధించిన నిబంధనావళి, విధివిధానాల రూపకల్పన ప్రక్రియను ఆరంభించామని, అది పూర్తవటానికి ఇంకా కొంత సమయం పడుతుందని ఆయన అన్నారు.

పార్టీని ఏర్పాటు చేయటంతో పాటు సంస్థాగతంగా దాన్ని పటిష్టం చేయడం, స్థానిక స్థాయిలో కూడా ఎక్కడికక్కడ కార్యవర్గాల్ని ఏర్పాటు చేసి బలోపేతం చేయటం వంటివన్నీ మొదట పూర్తి చెయ్యాలన్న ఆలోచనతో ఉన్నాం. అలా చేసిన తరువాతే ఏ ఎన్నికల్లోనైనా పోటీ పడాలన్నది తన మనోభిప్రాయమని, కాబట్టే వచ్చే నెల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరినీ మేం పోటీకి దింపే యోచన చేయటం లేదని, అందుకని విజ్ఞులు, వైఎస్సార్ పట్ల అంతులేని అభిమానం కలిగి ఉన్న వారు ఈ ఎన్నికల్లో వారి ఆత్మసాక్షి ప్రకారం నడుచుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన అన్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ex MP YS Jagan clarified that his camp will not contest in ensuing MLA election. He said that his camp will contest in any election omly after party is launched. He said that he is preparing to launch his party soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more