వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పులివెందుల నుంచి వైయస్ వివేకానే పోటీ, అయినా ఎమ్మెల్సీగా ఎన్నిక

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Vivekananda Reddy
న్యూఢిల్లీ: ఉప ఎన్నికల్లో పులివెందుల శాసనసభా నియోజకవర్గం నుంచి దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి సతీమణి వైయస్ విజయలక్ష్మిపై మంత్రి వైయస్ వివేకానంద రెడ్డినే పోటీకి దించాలని కాంగ్రెసు పార్టీ అధిష్టానం నిర్ణయించింది. పులివెందుల నుంచి తానే పోటీ చేస్తానని వైయస్ వివేకానంద రెడ్డి కూడా చెప్పారు. వైయస్ జగన్ వర్గం ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు తగిన వ్యూహాన్ని ఇప్పటికే కాంగ్రెసు అధిష్టానం సిద్ధం చేసింది.

మంత్రిగా ఉన్న వైయస్ వివేకానంద రెడ్డిని త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేల కోటా నంచి మండలికి తిరిగి పంపాలని నిర్ణయించింది. ఎమ్మెల్యేల కోటా నుంచి అభ్యర్థిగా నిర్ణయించడం వల్ల వివేకానంద రెడ్డి విజయానికి ఢోకా ఉండదని కాంగ్రెసు అధిష్టానం భావించినట్లు సమాచారం. అదే సమయంలో ఆ తర్వాత జరిగే పులివెందుల ఉప ఎన్నిక కాంగ్రెసు అభ్యర్థి కూడా వివేకానంద రెడ్డే అవుతారు. పులివెందుల నుంచి గెలిచే అవకాశాలపై అనుమానాలతో ముందు జాగ్రత్త చర్యగా ఆయనను మండలికి ఎన్నిక చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

పులివెందుల నుంచి వివేకానంద రెడ్డి ఓడిపోయినా ఎమ్మెల్సీగా మంత్రి పదవిలో కొనసాగడానికి ఏ విధమైన ఆంటకాలు ఉండవు. ఆరు నెలల పాటు శాసనసభకు గానీ మండలికి గానీ ప్రాతినిధ్యం వహించకపోయినా మంత్రిగా కొనసాగే అవకాశాలు ఉన్నప్పటికీ ఆ విధమైన ఇబ్బందిని ముందే నివారించాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్‌ను కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

English summary
Congress High Command has decided YS Vivekananda Reddy as MLC candidate from MLAs quota. As a 
 
 precuationary measure Congress leadership decided to make elected as MLC. 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X