• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

జీతాలు మహా లేటు! తెలంగాణకు సహాయ నిరాకరణ, సీమాంధ్రకు ఐటి!

By Srinivas
|

Hyderabad
హైదరాబాద్: ప్రతి నెల ఠంచన్‌గా జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులకు ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణలో ఉద్యోగుల సహాయ నిరాకరణ ఉద్యమం, సీమాంధ్రలో ఐటి కష్టాల నేపథ్యంలో రెండు ప్రాంతాలలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఈసారి చాలా ఆలస్యం కానున్నట్టుగా ఉంది. అయితే సీమాంధ్రలో రెండు మూడు రోజులు ఆలస్యం అయినా, తెలంగాణలో మాత్రం మరింత ఆలస్యమయ్యేట్టుగా కనిపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఆఖరి పని దినం రోజున జీతాలు చెల్లించడం రివాజు. ఫిబ్రవరి నెల జీతాన్ని 28వ తేదీన ఇవ్వాలంటే శనివారం నాటికి జీత భత్యాల బిల్లులు ట్రెజరీ కార్యాలయాలకు చేరాలి.

కానీ తెలంగాణ జిల్లాల్లో ఏ ట్రెజరీలోనూ జీతాల బిల్లులు స్వీకరించలేదు. బిల్లులు తీసుకు రావాల్సిందిగా ట్రెజరీల ఉన్నతాధికారుల నుంచి సమాచారం అందడంతో వివిధ ప్రభుత్వ శాఖలు తమ ఉద్యోగుల బిల్లులను హడావుడిగా పంపిచారు. అయితే ట్రెజరీ కార్యాలయాల వద్ద ఉద్యోగులెవరూ లేక బిల్లులను స్వీకరించ లేదు. ఒకవేళ ఎవరైనా ఉద్యోగి ధైర్యం చేసి బిల్లులు తీసుకుందామనుకున్నా ఆందోళనకారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉండటంతో ఆ సాహసం చేయలేకపోతున్నారు. ఒకవేళ జీతాల బిల్లుల వరకు సహాయ నిరాకరణను మినహాయించిన పక్షంలో సోమవారం వీటిని స్వీకరించవచ్చు.

వీటి ఆధారంగా మంగళవారం మార్చి 1 నాటికి ట్రెజరీ అధికారులు చెక్కులు తయారు చేయగలగాలి. అలా చెక్కులు సిద్ధమైనప్పటికీ అదే రోజున ఉద్యోగుల జీతాలు అందే అవకాశం లేదు. మార్చి 2వ తేదీ మహా శివరాత్రి. ఆ రోజు సెలవు. ఇక మూడు, నాలుగు తేదీల్లో చెక్కులు రెడీ అయితే ఐదారు తేదీల తర్వాత మాత్రమే జీతాల చెల్లింపులు జరగవచ్చని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఇదంతా జరగాలంటే సోమవారం ట్రెజరీల్లో బిల్లులు స్వీకరించాలి. ఉద్యమ తీవ్రతను చూస్తే ఇది ఏమాత్రం జరిగేలా కనిపించడం లేదు. సహాయ నిరాకరణ ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఈ పరిస్థితి చూస్తుంటే పదో తేదీ వరకు జీతాలు అందకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

సీమాంధ్ర జిల్లాల్లోనూ అనేక మంది ఉద్యోగులకు జీతాలు అందని పరిస్థితి నెలకొంది. ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగులంతా తమ ఆదాయ పన్ను వివరాలను ఫిబ్రవరి 25లోగా అందించాలి. వారి జీత భత్యాల బిల్లులను మాత్రమే సంబంధిత ట్రెజరీ కార్యాలయాల్లో సమర్పిస్తారు. అయితే ఈసారి నిబంధనలు మారాయి. దీని ప్రకారం నెలకు రూ.3 వేలకు పైగా కిరాయి చెల్లిస్తున్న ప్రతి ఒక్కరూ అద్దె రసీదు సమర్పించాలి. ఇలా లిఖితపూర్వకంగా రసీదు ఇచ్చేందుకు యజమానులు ఇష్టపడలేదు. దీంతో ఐటీ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల్లో చాలామందికి 1న జీతాలు అందే పరిస్థితి లేదని తెలిసింది. అయితే జీతాలకు నిధుల కొరత లేదని, జీతాలకు అవసరమైన రూ.3 వేల కోట్లు ట్రెజరీలకు అందుబాటులో ఉంచామని ఆర్థిక శాఖ అంటుంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Government employees will get salaries very late for this month. Government will not able to give salaries on the time due to Non Co-Operation effect in Telangana and IT problems in Seemandhra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more