వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రెహ్మాన్‌కు ఆస్కార్ అవార్డు మిస్, కొట్టేసిన సోషల్ నెట్‌వర్క్

By Pratap
|
Google Oneindia TeluguNews

AR Rahman
లాస్‌ ఏంజెలిస్‌: '127 అవర్స్‌' సినిమాకు గాను ఆస్కార్‌కి రెండు నామినేషన్లు పొందిన భారతీయ సినీ సంగీత దర్శకుడు ఏ. ఆర్‌. రహమాన్‌కు ఒరిజినల్‌ స్కోర్‌ విభాగంలో నిరాశే ఎదురైంది. ఈ విభాగంలో అవార్డు ద సోషల్‌ నెట్‌ వర్క్‌ చిత్రానికి గాను ట్రెంట్‌ రెజ్నార్‌, అటికస్‌ రాస్‌ గెలుచుకున్నారు. ఉత్తమ సహాయ నటుడి అవార్డు క్రిస్టియన్‌ బేల్‌(ద ఫైటర్‌)కి లభించింది. ఉత్తమ సౌండ్‌ ఎడిటింగ్‌, మిక్సింగ్‌ విభాగంలో 'ఇన్‌సెప్షన్‌' చిత్రం అవార్డు గెలుచుకుంది. హాలీవుడ్‌ చిత్ర పరిశ్రమ ప్రముఖులతో, వారి కుటుంబాలతో కొడాక్‌ థియేటర్‌ నిండిపోయింది. ఆస్కార్‌ అవార్డుల సందడి శోభాయమానంగా ప్రారంభమైంది. తొలి అవార్డు కళా దర్శకత్వానికి టామ్‌ హ్యాంక్స్‌ చేతులమీదుగా 'ఎలైస్‌ ఇన్‌ వండర్‌ల్యాండ్‌' సినిమా ఆర్ట్‌ డైరెక్టర్‌ అందుకున్నారు.

బెస్ట్‌ కాస్ట్యూమ్‌ అవార్డును కొలీన్‌ ఎట్‌వుడ్‌(ఎలైస్‌ ఇన్‌ వండర్‌ల్యాండ్‌) గెలుచుకుంది. ఇది ఆమెకు మూడో ఆస్కార్‌. 1999నుంచీ ఆమె ప్రతిఏటా నామినేట్‌ అవుతుండడం విశేషం.మేకప్‌ విభాగంలో అవార్డు 'ద ఉల్ఫ్‌మ్యాన్‌' కి లభించింది. టాయ్‌ స్టోరీ 3 కి బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫీచర్‌ ఫీల్మ్‌గా ఆస్కార్‌ అవార్డు లభించింది. ద లాస్ట్‌ థింగ్‌‌కు బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్‌ అవార్డు దక్కింది. ఉత్తమ అనుబంధ స్క్రీన్‌ ప్లే అవార్డును ద సోషల్‌ నెట్‌వర్క్‌కి గాను ఆరోన్‌ సోర్కిన్‌ గెలుచుకుంది. ఉత్తమ స్క్రీన్‌ప్లేకు ద కింగ్స్‌ స్పీచ్‌- డేవిడ్‌ సీడ్లర్‌ అవార్డు దక్కించుకున్నారు. విదేశీ భాషా చిత్రం కేటగిరిలో 'ఇన్‌ ఎ బెటర్‌ వరల్డ్‌' అవార్డు గెలుచుకుంది.

సినిమాటోగ్రఫీకి ఇన్‌సెప్షన్‌ సినిమా సినిమాటోగ్రాఫర్‌ వాలీ ఫిస్టర్‌కి లభించింది. బెస్ట్‌ సపోర్టింగ్‌ యాక్ట్రెస్‌ అవార్డు ప్రకటించడానికి వచ్చిన హాలీవుడ్‌ లెజెండ్‌ కిర్క్‌ డగ్లాస్‌కి స్టాండింగ్‌ ఒవేషన్‌ లభించింది. ఈ అవార్డు 'ద ఫైటర్‌' సినిమాకు గాను మెలిసా లియో గెలుచుకుంది. రెండోసారి నామినేట్‌ అయిన మెలిసా తొలిసారిగా అవార్డు విజేత అయింది.

English summary
Indian music director AR Rahman missed Oscar award in original score section. The award was went Social Network film. AR Rehman was nominated for this award. but He is not able to succeed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X