హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాకరపల్లి కాల్పులపై రభస, అసెంబ్లీ పది నిమిషాల పాటు వాయిదా

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: శ్రీకాకుళం జిల్లా కాకరపల్లి కాల్పుల ఘటనతో మంగళవారం శాసనసభ సమావేశాలు దద్ధరిల్లాయి. ఈస్ట్ కోస్ట్ థర్మల్ విద్యుత్కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ప్రజలపై పోలీసులు జరిపిన కాల్పుల్లో సోమవారం ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తక్షణ చర్చకు ప్రతిపక్షాలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించాయి. వాయిదా తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. శ్రీకాకుళం జిల్లా వడ్డితాండ్రలో పోలీసుకాల్పులపై శాసనసభలో చర్చించేందుకు సీపీఎం,సీపీఐ, తెలుగుదేశం, బిజెపిలు వాయిదా తీర్మానాలు సమర్పించాయి. కాల్పుల అంశం తీవ్రమైనందుకు ఈ రోజు సమావేశాల్లో దీనిపై చర్చించేందుకు అనుమతించాలని సీపీఐ విజ్ఞప్తి చేసింది.

శ్రీకాకుళం జిల్లా కాకర్లపల్లిలో ప్రభుత్వం బాధ్యాతారాహిత్యంగా వ్యవహరించిందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. కాల్పులు జరిపిన ప్రదేశానికి పోలీసులు యుద్దానికి వెళ్లారా ? అని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనలో నష్టపోయినవారికి న్యాయంచేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ ఘటన దురదృష్టకరమని డిప్యూటీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ అన్నారు. ఈ ఘటనపై హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పది గంటలకు ప్రకటన చేస్తారని, అందువల్ల సభ సాగేలా చూడాలని ఆయన చెప్పారు. అయినా ప్రతిపక్షాలు వినలేదు. శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా హోం మంత్రి ప్రకటన చేస్తారని చెప్పారు. సభను సాగనివ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్షాల సభ్యులు ఎంతకీ వినకపోవడంతో నాదెండ్ల మనోహన్ సభను పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

ప్రభుత్వ తీరుపై బిజెపి పక్ష నాయకుడు జి. కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల శవాలపై ప్రాజెక్టులు కడుతారా అని ఆయన సభ వాయిదా పడిన తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. ప్రజల సమాధులపై ప్రాజెక్టులు నిర్మిస్తామంటే అది ప్రజాస్వామ్యం కాదని ఆయన అన్నారు. కాగా, రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు మంగళవారం సభకు హాజరు కాలేదు. తెలుగుదేశం తెలంగాణ ప్రాంత సభ్యులు కూడా రైల్ రోకో కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు సభ్యులు సమావేశాలను బహిష్కరించారు. దీంతో సోమవారం వరకు తెలంగాణపై స్తంభించిన సభా కార్యక్రమాలు మంగళవారం శ్రీకాకుళం జిల్లా కాల్పుల ఘటనపై స్తంభించాయి.

English summary
Assembly adjourned for 10 minutes today as it was paralyzed by opposition Srikakulam district firing incident. Police fired at villagers, when they tried to obstruct East Coast Thermal power project works. Two persons were killed in police firing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X