వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై జైరాం రమేష్ సీరియస్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jairam Ramesh
న్యూఢిల్లీ: శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి వద్ద నిర్మిస్తున్న ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ యాజమాన్యంపై కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జైరాం రమేష్ సీరియస్ అయ్యారు. రమేష్ ప్రకటనతో కాకరాపల్లి గ్రామస్థులకు కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ప్లాంట్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేస్తామని ఆయన చెప్పారు. దీనిపై ఈ రోజే చర్యలు తీసుకుంటామని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. పనులు ఆపేయాలని ఆయన ప్లాంట్ యాజమాన్యాన్ని ఆదేశించారు. ఈస్ట్ కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పర్యావరణ అనుమతులు లేవని ఆయన స్పష్టం చేశారు.

శ్రీకాకుళం జిల్లా కాకరాపల్లి గ్రామంలో పవర్ ప్లాంట్ పనులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన గ్రామస్థులపై పోలీసులు సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ సంఘటనపై రాష్ట్ర శాసనసభలో గందరగోళం చెలరేగి సభ వాయిదా పడింది. కాకరాపల్లి గ్రామ ఘటనలో 2009 నుంచి పలువురిపై కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం శాసనసభలో చెప్పారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మరణించినట్లు ఆమె తెలిపారు. ఆందోళనకారుల దాడిలో పోలీసులు గాయపడ్డారని ఆమె అన్నారు.

English summary
Union Minister Jairam Ramesh became serious on East Coast Thermal Power project. He ordered the plant management to stop construction works. He said that notice will be served to management.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X