హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉద్యమానికి జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత సి. నారాయణ రెడ్డి

By Pratap
|
Google Oneindia TeluguNews

C Narayana Reddy
హైదరాబాద్: "ఈ ప్రాంతంలో పుట్టిపెరిగినవాణ్ణి.. ఇక్కడి ప్రజలకు.. ఈ మట్టికి.. ఈ ఉద్యమాలకు నేనెప్పుడూ రుణపడే ఉంటాను. తెలంగాణ భావనకు, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం సాగుతున్న ఉద్యమానికి నేనెప్పుడూ అనుకూలమే"నని జ్ఞానపీఠ అవార్డు గ్రహిత డాక్టర్ సి.నారాయణరెడ్డి ప్రకటించారు. "తెలుగు మాట్లాడేవారికి రెండు రాష్ట్రాలుండడం వాంఛనీయమే. పరిపాలన సౌలభ్యం, ఆర్థిక అభివృద్ది దృష్ట్యా చిన్నరాష్ట్రాల ఏర్పాటు అవశ్యకమని తాను రాజ్యసభ సభ్యునిగా ఉన్న కాలంలోనే స్పష్టం చేశాన"ని మంగళవారం విడుదల చేసిన పత్రిక ప్రకటనలో సినారె స్పష్టం చేశారు.

60వ దశకంలో గుంటూరు జరిగిన సన్మాన సభలో కూడ నేను తెలంగాణ బిడ్డనని సగర్వంగా చెప్పుకున్నానని తెలిపారు. 1953లోనే కాళోజీ, దాశరథిలతోపాటు తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి తెలంగాణలో తెలుగుభాషా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషిచేసినట్లు వెల్లడించారు. తెలంగాణ కవులు, రచయితలు ఏర్పాటు చేసే సాహిత్య సభల్లో తప్పకుండా పాల్గొంటానని సినారె స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన తెలంగాణ కవుల గర్జన సమావేశంలో తెలంగాణకు మద్దతు ప్రకటించాలని సినారెపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కవులు అనుకున్నారు. అవసరమైతే సినారె ఇంటిని ముట్టడించాలనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో సినారె ఈ ప్రకటన విడుదల చేశారు.

English summary
Jnanapith Awardee and prominent Telugu poet C Narayana Reddy clarified that he will support Telangana movement. He said that he has clarified his stand on Telangana, when he was Rajyasabha member.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X