శ్రీకాకుళం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చంద్రబాబుకు షాక్ ఇచ్చిన థర్మల్ పవర్ ప్రాజెక్టు బాధితులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
శ్రీకాకుళం: ఈస్ట్ కోస్ట్ థర్మల్ ప్రాజెక్టు బాధితులను పరామర్శించడానికి కాకరాపల్లి, వట్టితాండ్రలకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి బాధిత కుటుంబాల నుండి చేదు అనుభవం ఎదురయ్యింది. బాధితులు చంద్రబాబు ఎదుటే జిల్లాకు చెందిన టిడిపి రాష్ట్ర నాయకుడు ఎర్రన్నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. థర్మల్ ప్రాజెక్టు పాపంలో ఎర్రన్నాయుడు తమ్ముడు అచ్చెన్నాయుడుకు కూడా ఉందని వారు చంద్రబాబు ఎదుటే ఆరోపించారు.

పోలీసులు కాల్పులు జరిపి ఇద్దరు మరణించినా నేతలు స్పందించక పోవడాన్ని వారు ప్రశ్నించారు. ఎర్రన్నాయుడుపై బాధితులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో తీవ్ర అసహనానికి గురైన చంద్రబాబు బాధితులకు సర్దిచెప్పే ప్రయత్నాలు చేశారు. మేం చేస్తున్నది పార్టీ పరమైన పోరాటం అని, పార్టీ వేరు వ్యక్తులు వేరని ఆయన బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నాలు చేశారు.

English summary
Kakarapalli of Srikakulam district police firing victims gave shock to TDP president Chandrababu Naidu today. They blamed TDP senior leader Yerrannaidu and his brother for thermol project.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X