వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సివిసిగా పిజె థామస్ నియమాకాన్ని కొట్టేసిన సుప్రీంకోర్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

PJ Thomas
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషనర్‌గా పిజె థామస్ నియామకాన్ని సుప్రీంకోర్టు గురువారం కొట్టేసింది. భవిష్యత్తులో కేంద్ర విజిలెన్స్ కమిషనర్ (సివిసి) నియామకం విషయంలో అనుసరిసంచాల్సిన మార్గదర్శకత్వాలను కూడా సుప్రీంకోర్టు సూచించింది. పామోలిన్ దిగుమతి కుంభకోణంలో ఉన్నతస్థాయి కమిటీ చార్జిషీట్ పెండింగ్‌లో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోనందున సివిసిగా థామస్ నియామకం చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. థామస్ నియామకానికి ఉన్నత స్థాయి కమిటీ సిఫార్సు సరైంది కాదని అభిప్రాయపడింది. సుప్రీంకోర్టు తీర్పుతో కేంద్ర ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది.

థామస్ నియామకం నిబంధనల ప్రకారం జరగలేదని, చట్టవిరుద్ధంగా జరిగిందని ప్రధాన న్యాయమూర్తి ఎస్‌హెచ్ కపాడియా, న్యాయమూర్తులు కెఎస్ రాధాకృష్ణన్, స్వతంతర్ కుమార్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ వ్యాఖ్యానించింది. ఓ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్)పై సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జిఎం లింగ్డోతో పాటు పలువురు రిటైర్డ్ ఉన్నతాధికారులు, పోలీసు అధికారులు థామస్ నియామకాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. కేరళ కోర్టులో థామస్‌పై క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న నేపథ్యంలో వారు ఈ పిటిషన్ దాఖలు చేశారు.

English summary
In a serious blow to the government, the Supreme Court on Thursday quashed the appointment of PJ Thomas as Chief Vigilance Commissioner, saying the recommendation made by the high-powered committee headed by the Prime Minister did not consider the relevant material and as such its advice "does not exist in law".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X