హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టు వీడని తెలంగాణ ఉద్యోగులు, సహాయ నిరాకరణ కొనసాగింపు

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్‌: తెలంగాణ ఏర్పాటుపై స్పష్టత వచ్చే వరకూ రాజధానిసహా పది జిల్లాల్లో ప్రభుత్వ శాఖలు, స్థానిక సంస్థల్లో సహాయనిరాకరణ ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టీజీవోఎస్‌) ప్రకటించింది. ఉద్యోగులపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడితే మెరుపు సమ్మెకు దిగుతామని, అత్యవసర సేవలను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. టీజీవోఎస్‌ అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌గౌడ్‌ అధ్యక్షతన బుధవారం హైదరాబాద్‌లో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. గత నెల 17 నుంచి సహాయ నిరాకరణ మొదలయ్యాక మూడు దఫాలుగా ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ స్పష్టమైన హామీలు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. .

సహాయ నిరాకరణ యథాతథంగా కొనసాగుతుందని, వేతనాల కోసం వెనక్కి తగ్గేది లేదని ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. ఉద్యమంలోకి ప్రధాన రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, మంత్రులు కలిసిరావాలని విజ్ఞప్తి చేశారు. సహాయ నిరాకరణ కింద చేపట్టే భవిష్యత్‌ కార్యాచరణపై ఉద్యోగ సంఘాల ఐకాస స్టీరింగ్‌ కమిటీ సమావేశం గురువారం తీసుకునే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని తెలిపారు. వేతనాల కోసం ఉద్యోగులు పూచీకత్తుతో కూడిన లేఖ ఇవ్వాలనే ప్రతిపాదన తమ దృష్టికి రాలేదని, ఇలాంటి చర్యలను అడ్డుకుంటామన్నారు. తెలంగాణ కోసం జరుగుతున్న ఉద్యోగుల ఉద్యమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే నిరసనలు మరింత ముమ్మరమవుతాయని చెప్పారు.

English summary
TNGos decided to continue civil disobedience movement till Central government gives clarity on Telangana. They said that if government resort to harassment, they will do strike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X